Begin typing your search above and press return to search.

ఈ ఏడాది టాలీవుడ్ లో కోలుకోలేని విషాధాలు!

టాలీవుడ్ ఈ ఏడాది చాలా మంది కళాకారులని పోగొట్టుకుంది. స్టార్స్ కూడా మరణంతో దూరమయ్యారు

By:  Tupaki Desk   |   14 Dec 2023 4:17 AM GMT
ఈ ఏడాది టాలీవుడ్ లో కోలుకోలేని విషాధాలు!
X

టాలీవుడ్ ఈ ఏడాది చాలా మంది కళాకారులని పోగొట్టుకుంది. స్టార్స్ కూడా మరణంతో దూరమయ్యారు. ఆరంభం నుంచి టాలీవుడ్ లో విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో నందమూరి హీరో తారకరత్న ఫిబ్రవరి 18న గుండెపోటుతో చనిపోయారు. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. నటుడిగా ఇంకా ఎంతో లైఫ్ చూడాల్సిన తారకరత్నని మృత్యువు కబళించింది.

సీనియర్ స్టార్ హీరోయిన్, ఎన్ఠీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ తో నటించిన వెటరన్ యాక్టర్ జామున అనారోగ్య సమస్యలతో జనవరి 27న మరణించారు. ఆమె తన ఇంట్లోనే మృతువాత పడ్డారు. మరల ఫిబ్రవరిలో భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కళాతపస్వి కె విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతోనే మరణించారు. ఫిబ్రవరి 2న ఆయన మృతి చెందారు.

సినీ సంగీత దర్శకుడిగా కోటితో కలిసి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన రాజ్ మే 21 అనారోగ్య సమస్యలతోనే మృతి చెందారు. కొరియోగ్రాఫర్ గా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ జూన్ 18న అనారోగ్యంతో హాస్పిటల్ లో చనిపోయారు. సీనియర్ యాక్టర్ గా ఎన్నో వందల సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన శరత్ బాబు మే 22న చనిపోయారు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ కి మొదటి హీరోగా నటించి వారికి లక్కీ హ్యాండ్ గా మారిన సీనియర్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 12న అనారోగ్య సమస్యలతో చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా సినిమాలకి కూడా ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. నటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో చంద్రమోహన్ నటించారు. వీరితో పాటు కొంత మంది చిన్న నటులు కూడా ఈ ఏడాది మరణించిన వారిలో ఉన్నారు.

అన్నింటిలో ఎక్కువ బాధించింది మాత్రం తారకరత్న మరణం అని చెప్పాలి. అలాగే కళాతపస్వి కె విశ్వనాథ్ మరణం కూడా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు. మరల అలాంటి కళాత్మక చిత్రాలు తీసే దర్శకులు టాలీవుడ్ లో రాకపోవచ్చు.