Begin typing your search above and press return to search.

సైలెంట్ గా పని పూర్తి చేస్తున్న యువ హీరోలు

హంగామా వద్దు.. కష్టపడడం ముద్దు.. ప్రస్తుతం ఇదే ఫార్ములా మన టాలీవుడ్ యంగ్ హీరోలు ఫాలో అవుతున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   17 Jun 2025 11:14 AM IST
సైలెంట్ గా పని పూర్తి చేస్తున్న యువ హీరోలు
X

హంగామా వద్దు.. కష్టపడడం ముద్దు.. ప్రస్తుతం ఇదే ఫార్ములా మన టాలీవుడ్ యంగ్ హీరోలు ఫాలో అవుతున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఒకప్పుడు సినిమా స్టార్ట్ చేయడమే లేట్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేసే కొందరు హీరోలు.. ఇప్పుడు మాత్రం తమ పనిని సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు.

వరుస షెడ్యూల్స్ లో పాల్గొంటూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కంప్లీట్ గా వర్క్ పై ఫోకస్ పెట్టి బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఎదుర్కొన్న ట్రోల్స్ ను గుర్తించిన వారు.. ఇప్పుడు మంచి అవుట్ పుట్ ఇచ్చే విషయంపై దృష్టి పెట్టారు. ఆ లిస్ట్ లో యువ హీరోలు విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, సుధీర్ బాబు, ఆనంద్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు ఉన్నారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. వరుస సినిమాలతో ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక సౌండ్ వినిపించేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి సౌండ్ లేకుండా ఫంకీ మూవీని కంప్లీట్ చేస్తున్నారు. కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇప్పుడు కొరియన్ హారర్ కామెడీ మూవీ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయ్యాక రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి.. ఫుల్ గా ప్రమోట్ చేయాలని చూస్తున్నారట. అప్పటి వరకు సైలెంట్ గా ఉండనున్నారని సమాచారం.

యంగ్ హీరో సుధీర్ బాబు.. ఇప్పుడు జటాధరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ మూవీ వీఎఫ్ ఎక్స్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారట సుధీర్ బాబు.

క మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. దిల్ రూబాతో షాక్ నిరాశపరిచారు. రీసెంట్ గా కే ర్యాంప్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మూవీతో బిజీగా ఉన్నారు. కానీ ఎలాంటి సౌండ్ చేయడం లేదు. మెల్లగా పూర్తి చేసి అప్పుడు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్.

మరోవైపు, హీరో ఆనంద్ దేవరకొండ.. సితార ఎంటర్టైన్మెంట్స్ తో వర్క్ చేస్తున్నారు. కానీ ఎలాంటి అప్డేట్స్ లేకుండా షూట్ కంప్లీట్ చేస్తున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ కూడా తెలుసు కదా మూవీ విషయంలో అదే ఫాలో అవుతున్నారు. మిగతా యంగ్ హీరోలు లాగే జాగ్రత్త పడుతున్నారు. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.