Begin typing your search above and press return to search.

టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్.. వారి వల్లే మంచు విష్ణు లెఫ్ట్!

ఆ గ్రూప్ లో తాను ఉన్నానని, చాలా మంది తెలుగు హీరోలు ఉన్నారని ఇటీవల తన మూవీ హిట్-3 ప్రమోషన్స్ లో భాగంగా నాని చెప్పారు.

By:  Tupaki Desk   |   19 Jun 2025 5:50 PM IST
టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్.. వారి వల్లే మంచు విష్ణు లెఫ్ట్!
X

టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్.. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని కామెంట్స్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి! గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారో.. ఏం మాట్లాడుకుంటారోనని నెటిజన్లు డిస్కస్ చేసుకున్నారు. ఆ గ్రూప్ లో తాను ఉన్నానని, చాలా మంది తెలుగు హీరోలు ఉన్నారని ఇటీవల తన మూవీ హిట్-3 ప్రమోషన్స్ లో భాగంగా నాని చెప్పారు.

140 మందికి పైగా నటీనటులు ఉన్న ఆ గ్రూప్ లో ట్రైలర్లు, అప్డేట్లు పంచుకుంటూ ఉంటారని నాని తెలిపారు. అది ఒకప్పుడు ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు అంతగా లేదని చెప్పారు. ఇప్పుడు ఆ గ్రూప్ కోసం హీరో మంచు విష్ణు మాట్లాడారు. తన అప్ కమింగ్ మూవీ కన్నప్ప ప్రమోషన్స్ లో ఆ విషయాన్ని ప్రస్తావించారు.

తాను ఆ గ్రూప్ లో లేనని, లెఫ్ట్ అయ్యానని విష్ణు తెలిపారు. రానా, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ సహా అందరూ ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారన్న క్వశ్చన్ కు కూడా ఆన్సర్ ఇచ్చారు. ఆ గ్రూప్ లో చాట్ చేయాలంటే మాత్రం తనకు ఎందుకో బిడియంగా ఉండేదని పేర్కొన్న విష్ణు... అందుకే ఎగ్జిట్‌ అయ్యానని తెలిపారు.

నిజానికి రానా, బన్నీ ఆ వాట్సాప్ గ్రూప్ ను స్టార్ట్ చేశారని విష్ణు తెలిపారు. తాను కూడా అందులో ఉండేవాడినని చెప్పారు. అయితే ఆ గ్రూప్ లో అనేక హీరోయిన్స్ కూడా ఉన్నారని వెల్లడించారు. అందుకే చాట్ చేయాలంటే బిడియంగా అనిపించి బయటకు వచ్చానని చెప్పారు. ఏదైనా ఉంటే పర్సనల్ గా మెసేజ్ చేయమని బన్నీ, రానాకు చెప్పానని అన్నారు.

ఏదేమైనా తామంతా కలిసి పెరిగామని వెల్లడించారు మంచు విష్ణు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా.. ఒక్క ఫోన్ కాల్ తో ఒక్కటవుతామని తమ రిలేషన్ ను రివీల్ చేశారు. తమ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉందని తెలిపారు. తమ పేరెంట్స్ నేర్పిన మంచి విషయాల్లో అది కూడా ఒకటని, దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నామని చెప్పారు విష్ణు.

కాగా, విష్ణు.. ఇప్పుడు కన్నప్ప మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకు కథా రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వ్యవహరించారు. అన్నీ తానై ముందుకు తీసుకెళ్లారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న కన్నప్పతో ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.