Begin typing your search above and press return to search.

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

టాలీవుడ్‌లో మళ్లీ మాస్ పాటల సందడి మొదలుకానుంది. టైసన్ నాయుడులో నేహా శెట్టి, ఇడుపు కాయితంలో నాగదుర్గ స్పెషల్ సాంగ్స్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక బాలకృష్ణ దాదా సినిమాలో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది. ఈ మూడు పాటలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

By:  Srikanth Kontham   |   9 Nov 2026 1:26 PM IST
ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!
X

వెండి తెర‌పై స‌రైన మాస్ పాట‌లు చూసి చాలా కాల‌మ‌వుతోంది. హీరోలంతా పాన్ ఇండియా..కంటెంట్ బేస్డ్ చిత్రాలంటూ ముందుకెళ్ల‌డంతో మాస్ పాట‌ల‌కు ఆస్కారం లేకుండా పోతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో స్టార్ హీరోయిన్లే ఐటం భామ‌ల‌గా మార‌డంతో? అస‌లైన మాస్ క‌నెక్ట్ అవ్వ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అడ‌పా ద‌డ‌పా కొన్ని చిత్రాల్లో ఐటం పాట‌లు క‌నిపిస్తున్నా? ఆయా చిత్రాలు జ‌నాల‌కు రీచ్ అవ్వ‌క‌పోవ‌డంతో? వాటికి పాజిటివ్ టాక్ వ‌చ్చినా? ఫ‌లితం లేకుండా పోతుంది. ఈ నేప‌థ్యంలో ఉర మాస్ పాట‌ల‌తో రంజిప జేయ‌డానికి న‌వ న‌టీమ‌ణులు సిద్ద‌మ‌వుతున్నారు.

ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే...బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగ‌ర్ కే. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `టైస‌న్ నాయుడు` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నేహా శెట్టి న‌టిస్తోంది. అమ్మ‌డు మ‌ద్రాసి ర‌బ్బ‌ర్ బొమ్మ పాట‌తో హైలైట్ కానుంది. మాస్ పాట‌ల‌తో నేహా శెట్టి క‌నెక్ట్ అవ్వ‌డం సుల‌భ‌మే. అమ్మ‌డు ఇప్ప‌టికే టాలీవుడ్ కి వెల్ నోన్ పేస్ గా మారిపోయింది. యువ‌త‌ను ఆక‌ట్టుకునే రోల్స్ తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదిం చుకుంది. కెరీర్ ఆరంభంలో క్లాస్ సినిమాలు చేసినా? అటుపై సొగ‌స‌రి ఎంచుకునే పాత్ర‌లు మాస్ కు ఈజీగాక‌నెట్ట్ అవ్వ‌డం అమ్మ‌డికిప్పుడు క‌లిసొస్తుంది.

ఈ నేప‌థ్యంలో ర‌బ్బ‌ర్ బొమ్మ పాట‌తో థియేట‌ర్లో అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించ‌డం ఖాయం. అలాగే ప్రియ‌ద‌ర్శి హీరోగా వంశీ రెడ్డి దొండ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో `ఇడుపు కాయితం` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ తోనే సినిమా పై పాజిటివ్ బ‌జ్ నెల‌కొంది. ఇందులో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి నాగ‌దుర్గ న‌టించ‌డం మ‌రో ఆస‌క్తిర విష‌యం. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ భాగ‌మైంది. ఈ నేప‌థ్యంలో రొమాంటిక్ యాంగిల్ కూడా హైలైట్ అవుతుంది.

ఇందులో తెలంగాణ‌ స్టైల్ బారాత్ సాంగ్ ఇప్ప‌టికే వైర‌ల్ అవుతుంది. ఇందులో నాగ దుర్గ మాస్ అప్పిరియ‌న్స్ సినిమాకు అద‌న‌పు అస్సెట్ గా చెప్పొచ్చు. స్వ‌చ్ఛ‌మైన తెలుగు అమ్మాయి మాస్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో? నాగ‌దుర్గ నిరూపింస్తుంద‌నే న‌మ్మ‌కంతో మేక‌ర్స్ ఉన్నారు. ఇక నట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని `దాదా` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఐటం పాట‌లో బాలీవుడ్ ఐటం బాంబ్ న‌ర్గీస్ ప‌క్రీ న‌టిస్తుంది. స్పెష‌ల్ నెంబ‌ర్స్ లో న‌ర్గీస్ పెర్పార్మెన్స్ ఎలా ఉంటుందిన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. బాల‌య్య మాస్ ఇమేజ్..గోపీచంద్ ఎలివేష‌న్ తో పాట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిల‌వ‌నుంది.