Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్ తో పాటు సీనియ‌ర్ ఒకేసారి!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ అనూహ్యమైన వాతావరణం నెలకొంది. వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉండే అగ్ర హీరోలు అంతా ఒకే సమయంలో షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   31 July 2026 1:50 PM IST
చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్ తో పాటు సీనియ‌ర్ ఒకేసారి!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ అనూహ్యమైన వాతావరణం నెలకొంది. వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉండే అగ్ర హీరోలు అంతా ఒకే సమయంలో షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటసింహం బాలకృష్ణ వంటి టాప్ హీరోలు అందరూ గాయాల కారణంగా తాత్కాలికంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ పరిణామం టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులలోనూ చర్చనీయాంశంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `పెద్ది` షూటింగ్ లో మ‌ణికట్టుకు గాయమగడంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.

వైద్యుల సూచన మేరకు మణికట్టు శస్త్రచికిత్స చేయించుకున్న చ‌ర‌ణ్ ఎనిమిది వారాల పాటు పూర్తిగా విశ్రాంతిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విరామం కారణంగా ప్లానింగ్స్ అన్ని తారుమారవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ కోలుకుని సెట్స్‌లోకి ఎప్పుడెప్పుడా వస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అనూహ్యంగా విశ్రాంతి బాట పట్టాల్సి వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం `డ్రాగన్` షూటింగ్ శరవేగంగా సాగుతున్న తరుణంలో ఎన్టీఆర్‌కు భుజానికి గాయమైంది.

ఈ నేపథ్యంలో ఆయన కూడా వైద్యుల సలహా మేరకు ఎనిమిది వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయం కారణంగా `డ్రాగన్` షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉండటంతో ఈ గ్యాప్ సినిమా నిర్మాణ వేగంపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఇదే బాటలో ఉండటం గమనార్హం. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ సెట్స్‌లో బాలకృష్ణకు స్వల్ప గాయ‌మైన సంగ‌తి తెలిసిందే.

దీంతో బాల‌య్య కూడా కొద్దిరోజులు షూటింగ్స్‌కు దూరంగా ఉండి రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇలా అగ్ర హీరోలంతా ఒకే సమయంలో విరామ సమయంలోకి వెళ్లడం టాలీవుడ్ లో అరుదైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ముగ్గురు స్టార్ల రాకతో వేడెక్కాల్సిన షూటింగ్ లొకేషన్లు అన్నీ బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు అంటే కోట్ల రూపాయల బడ్జెట్, వేల మందితో కూడిన భారీ షెడ్యూల్స్ ముడిపడి ఉంటాయి.

అయితే హీరోల ఆరోగ్యమే ముఖ్యమ‌నే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు కూడా విరామాన్ని సానుకూలంగానే తీసుకుంటున్నారు. హీరోలు పూర్తిగా కోలుకుని సరికొత్త ఉత్సాహంతో తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టాలని యూనిట్లు భావిస్తున్నాయి. దీంతో సినిమా రిలీజ్ ల‌ విష‌యంలో కొంత జాప్యం జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు. ఎనిమిది వారాల పాటు రెస్ట్ అంటే? ముందుగా ప్ర‌క‌టించిన తేదీల‌కు రిలీజ్ అవ్వ‌డం అంత సుల‌భం కాదు. వ‌ర్క్ ప‌ర్పెక్ష‌న్ తో పాటు ప‌క్కా ప్లానింగ్ ఉంటేనే రిలీజ్ చేయ‌డం సాధ్య‌మ‌వుతుంది.