టార్గెట్ స్టార్ హీరోస్ ఓకే..మరి ఆ లాజిక్ ఎందుకు మరిచారు?
క్రేజీ స్టార్ల సినిమాల రిలీజ్ లు ఆలస్యం అవుతుండటం, స్టార్ హీరోలు రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తుండటం, థియేటర్లకు ఫీడింగ్ లేకపోవడంతో టాలీవుడ్‌లో సరికొత్త చర్చ మొదలైంది.
By: Tupaki Desk | 12 Jun 2025 8:00 AM ISTక్రేజీ స్టార్ల సినిమాల రిలీజ్ లు ఆలస్యం అవుతుండటం, స్టార్ హీరోలు రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తుండటం, థియేటర్లకు ఫీడింగ్ లేకపోవడంతో టాలీవుడ్‌లో సరికొత్త చర్చ మొదలైంది. దీనికితోడు హీరోలని టార్గెట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చేసిన కామెంట్‌లు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల థియేటర్ల మెయింటెనెన్స్ కష్టంగా మారిందని, థియేటర్లకు పెద్ద స్టార్ల సినిమాలు రావడం లేదని, దీంతో భారీ స్థాయిలో నష్టాలని చూస్తున్నామని కామెంట్‌లు చేశారు.
అంతే కాకుండా హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తే మా థియేటర్లు ఎలా నడుపుకోవాలి?. థియేటర్లు ఉన్నవాళ్లమంతా ఒకే రూఫ్ కిందకు వచ్చాం. మాగ్రూపును చూసి డిస్ట్రి బ్యూటర్ వస్తే మాకు నాలుగు డబ్బులు దొరుకుతాయి. హీరోల రెమ్యునరేషన్‌ల గురించి మాట్లాడే హక్కు మాకు లేదు. హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలనేదే మా ఆకాంక్ష. ఏ వ్యాపారమైనా డిమాండ్ అండ్ ప్లై మీదే ఆధారపడి ఉంటుంది. అంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కామెంట్‌లు చేయడం తెలిసిందే.
హీరోలని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్‌లు ఇప్పుడు సరికోత్త చర్చకు తెరలేపాయి. థియేటర్లకు భారీ స్థాయిలో ఫీడింగ్ కావాలన్నా, థియేటర్లు కళకళలాడాలన్నా స్టార్ హీరోల సినిమాలు కావాల్సిందే. అయితే హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారని, దాని కారణంగా థియేటర్లకు ఫీడింగ్ ఉండటం లేదని, దాని కారణంగా థియేటర్లు మూసుకునే పరిస్థితికి వచ్చామని చెబుతున్న ఎగ్జిబిటర్లు ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నారు.. లేదు లేదు దాచేస్తున్నారు.
ఇన్నేళ్లుగా ఏంటంటే థియేటర్లు స్టార్ల వల్లే నడిచాయా?..చిన్న హీరోలు, చిన్న సినిమాలు థియేటర్లని పోషించలేదా? మరి వారిని ఎందుకు ఎగ్జిబిటర్లు మర్చిపోతున్నారు? ఎందుకు చిన్న హీరోలకు, చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు. పెద్ద హీరోలు సినిమాలు రానప్పుడు థియేటర్లని పోషించేది చిన్న సినిమాలే కదా? ఈ లాజిక్‌ని ఎందుకు మర్చిపోతున్నారు. చిన్న హీరోలని, చిన్న సినిమాలని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు? ఒక్కసారి ఆలోచించాలని సగటు సినీ లవర్ ప్రశ్నిస్తున్నాడు.
థియేటర్లకు స్టార్స్ అవసరమే కానీ చిన్న హీరోలు, చిన్న సినిమాలు లేకుండా థియేటర్లు నిజంగా మూసుకోవాల్సిందే. స్టార్ల వంకతో థియేటర్లకు ఫీడింగ్ లేకుండా పోతోందని, రెండేళ్లకో సినిమా చేస్తున్నారని విమర్శలు చేసే ఎగ్జిబిటర్లు చిన్న సినిమాలు, చిన్న హీరోలకు థియేటర్లు కేటాయించే విషయంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారో.. వారిని ఎలా ఆడుకుంటున్నారో ఒక్కసారి ఆలోచిస్తే థియేటర్లకు సమస్యలని ఎవరు సృష్టిస్తున్నారో క్లియర్ కట్‌గా అర్థమవుతుందని, ఈ విషయంలో రియలైజ్ అయితే సినిమాతో పాటు థియేటర్ల మనుగడ కొనసాగుతుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
