Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో 'ఆ నలుగురు'.. థియేటర్స్ ఎవరికి ఎక్కువంటే?

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? ఎవరివి ఎన్ని? వంటి పలు వివరాలు చూద్దాం.

By:  Tupaki Desk   |   28 May 2025 6:52 PM IST
టాలీవుడ్ లో ఆ నలుగురు.. థియేటర్స్ ఎవరికి ఎక్కువంటే?
X

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ అంటూ ప్రకటన.. ఆ తర్వాత లేదని అనౌన్స్మెంట్.. ఇంతలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ నుంచి సంచలన నోట్.. ఇవన్నీ జరిగాక టాలీవుడ్ అంతా ఆ నలుగురు చేతిలో ఉందని.. సోషల్ మీడియాలో ఒకటే చర్చ. అందుకే ఇలాంటి సంఘటనలు జరిగాయని ఓ రేంజ్ లో డిస్కషన్లు కనిపించాయి.

దీంతో తెలుగు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ తో పాటు దిల్ రాజు స్పందించారు. తాను ఆ నలుగురిలో లేదని అల్లు అరవింద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో నావి 15 లోపేనని అన్నారు. ఆ తర్వాత దిల్ రాజు.. నైజాంలో తన థియేటర్లు 30 మాత్రమేనని చెప్పారు. ఉత్తరాంధ్రలో 20 థియేటర్స్ ఉన్నాయని తెలిపారు.

అదే సమయంలో నిర్మాతల వ్యాఖ్యల తర్వాత.. థియేటర్స్ వ్యాపారం లెక్కలు.. ఆ నలుగురు చేతిలోనే ఉందని ప్రచారం.. ఆ రెండు విషయాలపై నిశితంగా పరిశీలన చేయాలని అనేక మంది నెటిజన్లు అనుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? ఎవరివి ఎన్ని? వంటి పలు వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్లో మొత్తం థియేటర్స్ సంఖ్య- 1096

యజమానులు నిర్వహిస్తున్న సింగిల్ స్క్రీన్స్-317

నేషనల్ చైన్స్ లేదా లోకల్ వాళ్ల మల్టీప్లెక్సులు- 161

పలు సంస్థలు పంపిణీ చేస్తున్న స్క్రీన్లు- 227

ఆ నలుగురులో సురేష్ బాబు, దిల్ రాజు, ఆసియన్ సునీల్, అల్లు అరవింద్ అని ప్రచారం జరుగుతుంది కనుక ఆ పరంగా చూసుకుంటే సురేష్ బాబుకు 64 స్క్రీన్స్ ఉండగా, దిల్ రాజు 31 స్క్రీన్లు, గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద గీతా చైన్ (G3, G6, G7తో సహా) 32 స్క్రీన్స్ ఉన్నాయి. సునీల్ ఏపీలో అస్సలు లేవు. యూవీ క్రియేషన్స్ 37 థియేటర్లను కలిగి ఉంది. ఇది దిల్ రాజు, గీతా ఆర్ట్స్ రెండింటి కంటే ఎక్కువ. కానీ ఆ పేరే వినపడటం లేదు.

తెలంగాణలో మొత్తం స్క్రీన్స్ సంఖ్య 570 కాగా, ఇందులో 289 సింగిల్ స్క్రీన్లు, 281 మల్టీప్లెక్స్‌ లు ఉన్నాయి. ఆసియన్ సునీల్ ది తెలంగాణలో ఆధిపత్యం ఉంది. 61 సింగిల్ స్క్రీన్‌ లు, 71 మల్టీప్లెక్స్‌ లు ఆయన నియంత్రణలో ఉన్నాయి. దిల్ రాజు 17 మల్టీప్లెక్స్‌ లు, మైత్రీ మూవీ మేకర్స్ వారి మైత్రి ఎగ్జిబిటర్స్ 14 స్క్రీన్‌ లను కలిగి ఉన్నారు.

అల్లు అరవింద్ కు ప్రత్యక్ష యాజమాన్యం లేదు. కానీ AAA మల్టీప్లెక్స్ లలో ఆసియన్ సునీల్ తో పాటు కొంత వాటా ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబుకు తెలంగాణలో అస్సలు స్క్రీన్లు లేవు. మిగిలిన థియేటర్లను వ్యక్తిగత యజమానులు, కార్పొరేట్ చైన్స్ నడిపిస్తున్నాయి. దాని బట్టి చూస్తే ఆ నలుగురికి తక్కువ థియేటర్సే ఉన్నాయి. అయితే ఆ థియేటర్స్ లిస్ట్ పూర్తిగా కన్ఫర్మ్ కాదు. మార్పులు చేర్పులు ఉండవచ్చు.