ఇండియన్ సినిమాని ఏలేస్తున్న టాలీవుడ్
ఇండియన్ సినిమా గురించి ఎక్కడ చర్చ మొదలైనా వినిపిస్తున్న పేరు టాలీవుడ్ సినిమా.
By: Tupaki Desk | 10 April 2025 12:00 AM ISTఇండియన్ సినిమా గురించి ఎక్కడ చర్చ మొదలైనా వినిపిస్తున్న పేరు టాలీవుడ్ సినిమా. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ పేరు మాత్రమే వినిపించేది. నేషనల్ అవార్డుల సమయంలోనూ బాలీవుడ్‌దే ఆధిపత్యం. కానీ రోజులు మారాయి. ఓడలు బల్లు..బల్లు ఓడలు అవుతాయన్న చందంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఫిల్మ్ మేకర్‌ని కదిలించినా..హాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లు సైతం ముక్తకంఠంతో తెలుగు సినిమాని కీర్తిస్తున్నారు. జేమ్స్ కెమెరూన్ సైతం టాలీవుడ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే.
`బాహుబలి`తో టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిన టాలీవుడ్ ఇప్పటికీ ఆ జోష్‌ని అలాగే మెయింటైన్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మన స్టార్ హీరోలు వరుసగా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తూ పట్టాలెక్కిస్తుండటమే. `దేవర`తో హిట్‌ని దక్కించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీని తరువాత కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ భారీ హైవోల్టేజ్ యాక్షన్ పీరియాడిక్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నందమూరి తారకరామారావు ఆర్ట్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్‌ని పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మొదలైన రాజమౌళి - మహేష్‌ల ప్రాజెక్ట్ కూడా దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ చేస్తున్న `రాజా సాబ్`, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 చిత్రాల కోసం కూడా దేశం మొత్తం ఎదురు చూస్తోంది.
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న`పెద్ది` ప్రాజెక్ట్ కూడా వార్తల్లో నిలుస్తూ తెలుగు సినిమా హాట్ టాపిక్ అయ్యేలా చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని ఇటీవలే విడుదల చేయడం, అది టాక్ ఆఫ్ ది ఇండియాగా మారడం తెలిసిందే. వీటితో పాటు తాజాగా అల్లు అర్జున్- అట్లీల ప్రాజెక్ట్ కూడా ప్రకటించడంతో సౌత్ టు నార్త్ తెలుగు సినిమా ఏలేస్తోందనే చర్చ మొదలైంది. సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ హంగులతో ఈ ప్రాజెక్ట్‌ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో పాటు నేచురల్ స్టార్ నాని `ది పారడైజ్` కూడా రీసౌండ్ ఇవ్వడంతో రానున్న రోజుల్లో తెలుగు సినిమా హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండియాగా మారడం ఖాయమని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.
