టీవీ రేటింగ్స్‌లో దారుణం: ‘గేమ్ ఛేంజర్’ టీఆర్‌పీతో షాక్!
2025లో టాలీవుడ్ స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సందడి చేసినప్పటికీ, టీవీ రేటింగ్స్ (టీఆర్‌పీ) విషయంలో మాత్రం దారుణ ఫలితాలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 8 May 2025 4:52 PM2025లో టాలీవుడ్ స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సందడి చేసినప్పటికీ, టీవీ రేటింగ్స్ (టీఆర్‌పీ) విషయంలో మాత్రం దారుణ ఫలితాలు వస్తున్నాయి. రీసెంట్‌గా రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ టీవీలో మొదటిసారి ప్రసారం కాగా, కేవలం 5.02 టీఆర్‌పీ మాత్రమే వచ్చింది. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సినిమాలు కూడా ఈ మధ్య చాలా తక్కువ టీఆర్‌పీ సాధించాయి.
ఈ రేటింగ్స్ చూస్తే టీవీ శాటిలైట్ మార్కెట్‌పై ఓటీటీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్లు సాధించలేకపోయినప్పటికీ, టీవీ రేటింగ్స్ విషయంలో ఇంత తక్కువ స్కోర్ రావడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఒకప్పుడు ఎంత డిజాస్టర్ సినిమా అయినా కూడా 10కి పైగా టీఆర్‌పీ వచ్చేది. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రభావం గట్టిగా పడడంతో శాటిలైట్ మార్కెట్ దారుణంగా పడిపోయింది.
ఈ రోజుల్లో ప్రేక్షకులు సినిమాలను ఓటీటీలోనే చూడటానికి ఆసక్తి చూపుతున్నారు, దీంతో టీవీ ప్రసారాలకు డిమాండ్ తగ్గుతోంది. అందులోనూ టీవీల్లో యాడ్స్ రావడం, ఓటీటీలో ఎప్పుడైనా చూసుకునే సౌకర్యం ఉండడం ఆ ఎఫెక్ట్ కు కారణాలు. మరోవైపు, ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల గ్రాస్ సాధించి 2025లో బిగ్గెస్ట్ గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ, ఈ సినిమాకు కేవలం 12.61 టీఆర్‌పీ మాత్రమే రావడం ఆశ్చర్యం కలిగించింది.
గతంలో అల్లు అర్జున్ సినిమాలు యావరేజ్‌గా ఉన్నప్పటికీ, టీవీలో 12-15 టీఆర్‌పీ రేంజ్‌లో రేటింగ్స్ సాధించేవి. అలాంటి సినిమాకు ఈ రేంజ్‌లో రేటింగ్ రావడం శాటిలైట్ మార్కెట్‌లో మార్పులను సూచిస్తోంది. ‘గుంటూరు కారం’ సినిమా 9.23 టీఆర్‌పీతో మహేష్ బాబు అభిమానులను అలరించింది. ‘సలార్’ 6.5 టీఆర్‌పీతో మోస్తరు రేటింగ్ సాధించగా, ‘కల్కి 2898 ఏడీ’ 5.26 టీఆర్‌పీతో మరింత తక్కువ స్కోర్ చేసింది. ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద రూ.530 కోట్ల గ్రాస్ సాధించినప్పటికీ, టీవీలో ఈ రేంజ్‌లో రేటింగ్ రావడం ఆశ్చర్యకరం.
ఈ రేటింగ్స్ చూస్తే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల శాటిలైట్ మార్కెట్ ఎంతగా దెబ్బతిందో అర్థమవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు టీవీలో భారీ రేటింగ్స్ సాధించేవి, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకులు సినిమాలను ఓటీటీలోనే చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు, దీంతో టీవీలో ప్రసారాలకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ట్రెండ్ భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్టార్ హీరోల రీసెంట్ సినిమాల TRPలు
గుంటూరు కారం - 9.23
సలార్ - 6.5
కల్కి2898AD - 5.26
పుష్ప 2 - 12.61
గేమ్ ఛేంజర్ - 5.02