టైమ్ గ్యాప్.. కానీ క్రేజ్ అదే!
తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు స్టార్ హోదా వెలగబెట్టిన ఎంతోమంది నటీనటులు పెళ్లి, పర్సనల్ లైఫ్ వల్ల సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చారు.
By: Madhu Reddy | 10 July 2026 1:47 PM ISTతెలుగు చిత్రసీమలో ఒకప్పుడు స్టార్ హోదా వెలగబెట్టిన ఎంతోమంది నటీనటులు పెళ్లి, పర్సనల్ లైఫ్ వల్ల సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చారు. అయితే, ఎంత కాలం విరామం తీసుకున్నా, వెండితెరపై వారికున్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. తాజాగా నటి లయ 20 ఏళ్ల తర్వాత జగపతి బాబుతో కలిసి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ కంబ్యాక్ ల టాపిక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుదీర్ఘ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అలరిస్తున్న ఆ స్టార్స్ ఎవరో ఓసారి చూద్దాం..
20 ఏళ్ల తర్వాత లయ-జగపతి బాబు మ్యాజిక్:
ఒకప్పుడు మనోహరం, దొంగ దొంగడు లాంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన నటి లయ, పెళ్లి తర్వాత సినిమాలకు దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆమె జగపతి బాబుతో కలిసి ‘వదలా’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక జూలై 17న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. జగపతి బాబు కూడా ఈ చిత్రంలో హీరోగా నటించడం విశేషం.
జగపతి బాబు 'లెజెండ్' కంబ్యాక్:
ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జగపతి బాబు కెరీర్ ఒక దశలో స్లో అయిపోయింది. ఆ సమయంలో బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా మారి ఆయన పవర్‌ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు. అప్పటి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మారుతూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ బిజీ యాక్టర్‌గా మారిపోయారు. ఇక ఇప్పుడు మళ్లీ 'వదలా'తో హీరోగా అలరించబోతున్నారు.
'మన్మథుడు' ఫేమ్ అన్షు.. అమల అక్కినేని:
నాగార్జున 'మన్మథుడు', ప్రభాస్ 'రాఘవేంద్ర' సినిమాలతో కుర్రకారు మనసులు దోచుకున్న అన్షు.. పెళ్లి చేసుకొని లండన్‌లో సెటిల్ అయిపోయారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత సందీప్ కిషన్ సినిమాలో కీలక పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. అలాగే సీనియర్ నటి అమల అక్కినేని కూడా సుదీర్ఘ గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మంచి పాత్ర ఎంచుకున్నారు.
లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ:
ఒకప్పుడు టాలీవుడ్‌ను శాసించిన లేడీ అమితాబ్ విజయశాంతి రాజకీయాల వల్ల సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె ఇచ్చిన కంబ్యాక్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. ఇక తన పవర్‌ఫుల్ నటనతో ఇప్పటికీ తన రేంజ్ తగ్గలేదని ఆమె నిరూపించారు.
రాశి, మీనా.. సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్:
హీరోయిన్‌గా ఎన్నో హిట్ సినిమాలు చేసిన రాశి, దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి మెప్పించారు. ఇటీవల వచ్చిన పాపం ప్రతాప్ మూవీలో ఓ మంచి పాత్ర తో అలరించారు. మరోవైపు సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా కూడా పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి, వెంకటేష్ సరసన ‘దృశ్యం’ సినిమాతో అదిరిపోయే రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
కళాకారుడికి వయసుతో గానీ, టైమ్ గ్యాప్‌తో గానీ సంబంధం లేదని ఈ స్టార్స్ అందరూ నిరూపించారు. నటన అనేది వారి రక్తంలోనే ఉండటం వల్ల ఎంతకాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చినా పాత మ్యాజిక్‌ను రిపీట్ చేస్తున్నారు. మరి జూలై 17న రాబోతున్న ‘వదలా’ సినిమాతో లయ, జగపతి బాబుల జోడీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
