ఇండస్ట్రీలో వెనుకబడిన వారసులు!
ఇండస్ట్రీలో బ్యాకప్ ఎంతో అవసరం. అది ఉంటే ఎంట్రీ ఈజీ అవుతుంది. అవకాశం కోసం స్వయంగా తాము కష్టపడాల్సిన పనిలేదు. తండ్రులు..తాతలు వేసిన పునాదులుంటాయి కాబట్టి ఛాన్స్ ఈజీ అవుతుంది.
By: Tupaki Desk | 23 July 2025 9:00 PM ISTఇండస్ట్రీలో బ్యాకప్ ఎంతో అవసరం. అది ఉంటే ఎంట్రీ ఈజీ అవుతుంది. అవకాశం కోసం స్వయంగా తాము కష్టపడాల్సిన పనిలేదు. తండ్రులు..తాతలు వేసిన పునాదులుంటాయి కాబట్టి ఛాన్స్ ఈజీ అవుతుంది. ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ తనయుడు అలాగే 'నిర్మలా కాన్వెంట్'తో అలాగే ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున నిర్మించిన ఆచిత్రంలో ఏ కుర్రాడైతే బాగుంటుందని ఆలోచించి రోషన్ ని తీసుకున్నారు. అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా 'రుద్రమదేవి' సినిమా చేసిన అనుభవం కూడా ఉంది. అలా నిర్మలా కాన్వెంట్ లో మెయిన్ లీడ్ అయ్యాడు.
ఆ తర్వాత 'పెళ్లి సందడి' తో హీరోగా మారిన సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకూ సోలో హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. హీరోయిక్ లుక్ ఉంది. ఎలాంటి కథకైనా, పాత్రకైనా సెట్ అవ్వగల కటౌట్. ప్రామిసింగ్ యాక్టర్ గా పేరుంది. ప్రతిభావంతుడు. ఇలా అన్ని ఉన్నా? ఇండస్ట్రీలో రాణించకలేపోతున్నాడు? అన్నది వాస్తవం. ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'వృషభ'లో నటిస్తున్నాడు. అలాగే 'ఛాంపియన్' అనే మరో సినిమా చేస్తున్నాడు. కానీ సోలోగా అవకాశాలు మాత్రం సాధించలేక పోతున్నాడు.
దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రోషన్ కననకాల కూడా. రాజీవ్ కనకాల-సుమల తనయుడిగా రోషన్ కి ఓ ఐడెంటిటీ ఉంది. తల్లిదండ్రులకు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది. కావాల్సినన్ని పరిచయా లున్నాయి. కానీ ఇవేవి రోషన్ ని బిజీ నటుడిగా మార్చలేకపోయతున్నాయి. 'బబుల్ గమ్' తో పరిచయమైన రోషన్ కు తొలి సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రస్తుతం 'మోగ్లీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమాపై ఎలాంటి బజ్ లేదు. అటు పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ కూడా కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు గానీ ఫలించడం లేదు.
'ఛోర్ బజార్' తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయాడు. మూడేళ్లగా ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ రావడం లేదు. అటు పేపర్ బోయ్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన సంతోష్ శోభన్ క్లిక్ అవుతాడు? అనుకుంటోన్న సమయంలోనే డౌన్ ఫాలో మొదలైంది. వరుస పరాజయాలు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాడు. అతడి తండ్రి శోభన్కి దర్శకుడిగా మంచి పేరున్న సంగతి తెలిసిందే. ఇలా యువ వారసులంతా రేసులో బాగా వెనుకబడే ఉన్నారు.
