Begin typing your search above and press return to search.

రా అండ్ రాస్టిక్ సినిమా చేస్తే సక్సెస్ వచ్చినట్టేనా.? స్టార్ హీరోల కెరియర్ ఏం చెప్తుంది...

ఏది ఏమైనా కూడా తము చేయబోయే సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని తద్వారా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   22 Sept 2026 4:57 PM IST
రా అండ్ రాస్టిక్ సినిమా చేస్తే సక్సెస్ వచ్చినట్టేనా.? స్టార్ హీరోల కెరియర్ ఏం చెప్తుంది...
X

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎట్లాంటి సినిమాలు చేస్తే తమకు సక్సెస్ లు దక్కుతాయనే విషయంలో స్టార్ హీరోలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా కూడా తము చేయబోయే సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని తద్వారా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' సినిమా రా అండ్ రస్టిక్ నేపథ్యంలో తెరకెక్కింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలావరకు మార్పులు వచ్చాయి. ఇప్పుడున్న స్టార్ హీరోలందరు అలాంటి సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకొని చిత్తూరు యాసలో మాట్లాడి ప్రేక్షకులందరిని ఎంటర్ టైన్ చేశాడు.

నాని సైతం 'దసర' సినిమాతో అలాంటి బ్యాక్ డ్రాప్ లోనే వచ్చి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన 'పెద్ది' సినిమా కూడా అలాంటి నేపథ్యంలోనే రావడం విశేషం... ఇక అక్కినేని అఖిల్ సైతం లెనిన్ సినిమాతో సక్సెస్ సాధించాడు. ఈ మూవీ కూడా రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చింది. అఖిల్ ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాలు దాటినా కూడా అతనికి సరైన సక్సెస్ లేదు. ఇక లెనిన్ తో ఆయన మొదటి సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తన అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. చాలామంది స్టార్ హీరోలు సైతం అదే బాటను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్టార్ హీరోలందరు ఎందుకని అదే నేపథ్యంలో కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ట్రెండ్ లో ఏ సినిమాలు ఉంటే అలాంటి బ్యాక్ డ్రాప్ లోనే సినిమాలను చేసి దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రతి ఒక్క హీరో కోరుకోవడంలో తప్పైతే లేదు. ఇప్పుడు రా అండ్ రస్టిక్ నేపథ్యంలో సినిమాలు నడుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అలాంటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక మరో 2 సంవత్సరాల పాటు ఇలాంటి సినిమాలే రాబోతున్నాయి. ఆ తర్వాత ఈ మూవీస్ ప్రేక్షకులకు బోర్ కొట్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపు కొంతమంది స్టార్ డైరెక్టర్లు మరింత డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటుండటం విశేషం...