టాలీవుడ్‌లో ఆసక్తిరేపుతున్న క్రేజీ ట్రెండ్!
ఇదిలా ఉంటే మన స్టార్ హీరోలు తమిళ డైరెక్టర్లతో సై అంటూ క్రేజీ ప్రాజెక్ట్‌లకు రెడీ అయిపోతున్నారు.
By: Tupaki Desk | 9 April 2025 3:35 PM ISTటాలీవుడ్‌లో క్రేజీ ట్రెండ్ నడుస్తోంది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు మన హీరోలు..మన డైరెక్టర్లతో మాత్రమే వర్క్ చేసేవారు... కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. తమిళ, కన్నడ డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నారు. తమిళ హీరోలు కూడా మునుపెన్నడూ లేని విధంగా మన డైరెక్టర్లతో కలిసి పని చేస్తూ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతున్నారు. కన్నడ స్టార్లు, మలయాళ స్టార్లు కూడా మన స్టార్లతో కలిసి నటిస్తుండటం శుభపరిణామం. ఈ ట్రెండ్ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే మన స్టార్ హీరోలు తమిళ డైరెక్టర్లతో సై అంటూ క్రేజీ ప్రాజెక్ట్‌లకు రెడీ అయిపోతున్నారు. అట్లీతో కలిసి అల్లు అర్జన్ భారీ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో బన్నీ సూపర్ హీరో తరహా క్యారెక్టర్‌లో కనిపించనున్నాడట. దీంతో ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బన్నీ తరువాత కోలీవుడ్ డైరెక్టర్‌పై కన్నేసిన స్టార్ ఎన్టీఆర్. ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ `వార్2తో పాటు సోలో హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలైంది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. దీని తరువాత ఎన్టీఆర్ `జైలర్` ఫేమ్ నెల్సన్‌తో ఓ భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. అంతే కాకుండా వెట్రిమారన్‌తోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్ కూడా తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు.
చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాకే ఇద్దరు కలిసి ఓ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుడుతారట. చరణ్ కూడా లోకేష్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు. నాగార్జున ప్రస్తుతం లోకేష్ డైరెక్షన్‌లో రజనీకాంత్ తో చేస్తున్న `కూలీ`లో నటిస్తున్నారు. వీరి వరుస ఇలా ఉంటే మన డైరెక్టర్ల కోసం తమిళ హీరోలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ధనుష్‌తో `సార్` సినిమా చేసిన వెంకీ అట్లూరితో సూర్య ఓ భారీ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక కార్తి కూడా మరోసారి తెలుగులో స్ట్రెయిట్ ఫిల్మ్ చేయబోతున్నాడు.
నాని హీరోగా శైలేష్ కొలను చేస్తున్న మూవీ `హిట్ 3`. దీనికి కొనసాగింపుగా రానున్న `హిట్ 4`లో కార్తి నటిస్తాడని తెలిసింది. `హిట్3` ఎండింగ్‌లో కార్తి కనిపించి సర్‌ప్రైజ్ చేయనున్నాడట. వీరితో పాటు ధనుష్ మరోసారి తెలుగు డైరెక్టర్‌తో పని చేస్తున్న విషయం తెలిందే. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న `కుబేర`లో ధనుష్ హీరో. ఈ మూవీ త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీని తరువాత త్రివిక్రమ్‌తోనూ ధనుష్ వర్క్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కమల్ హాసన్ కూడా తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో `కల్కి` చేయం తెలిసిందే. పార్ట్ 2లోనూ సుప్రీమ్ యాస్కిన్‌గా తన నటవిశ్వరూపంతో విజృంభించబోతున్నారు. ఇక మక్కల్ సెల్వన్‌గా పేరున్న వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది.
