ఆకట్టుకుంటున్న డైరెక్టర్ కూతురు... ఫొటోస్ వైరల్!
అయితే తాజాగా ఇప్పుడు శేఖర్ కమ్ముల కూతురు వందనకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 30 Oct 2025 9:30 PM ISTఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీల వారసులు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే అందరూ ఇండస్ట్రీలోకి వస్తున్నారా అంటే చెప్పలేని పరిస్థితి. కొంతమంది ఇండస్ట్రీలోకి హీరోగా, హీరోయిన్గా అడుగు పెడితే మరికొంతమంది వివిధ విభాగాలలో తమ టాలెంటును నిరూపించుకుంటున్నారు. అయితే ఇంకొంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. కానీ ఇలా సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు దర్శనమిచ్చి అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ కూతురుకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఈమె ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూతురు. అయితే ఈమె ఇండస్ట్రీలోకి వస్తారో రారో తెలియదు కానీ ఈమె గ్లామర్ లుక్ ఫోటోలు మాత్రం అందరిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శేఖర్ కమ్ములకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ చూసిన నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ అనే సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టి ఇప్పటికి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. శేఖర్ కమ్ముల కెరియర్ 2004 లో విడుదలైన ఆనందం సినిమా తన కెరీయర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత గోదావరి, హ్యాపీ డేస్, లీడర్ , లవ్ స్టోరీ, ఫిదా, కుబేర తదితర చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు శేఖర్ కమ్ముల. ఎక్కువగా ఫీల్ గుడ్ మూవీలు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలని తెరకెక్కిస్తూ ఉండడం ఈయన స్పెషల్.
ఇదంతా పక్కన పెడితే శేఖర్ కమ్ముల తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ కూడా పెద్దగా ప్రస్తావించారు. ఆయన కూడా ఏదైనా సినిమా రిలీజ్ అవుతున్నదంటే బయట కనిపిస్తారు తప్ప మళ్లీ పెద్దగా ఎక్కడ యాక్టివ్ గా ఉండరు. అయితే తాజాగా ఇప్పుడు శేఖర్ కమ్ముల కూతురు వందనకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమధ్య కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సందడి చేసిన వందన ఇప్పుడు తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది .
అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల కూతురు అందానికి ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తూ బర్తడే విషెస్ తెలియజేస్తున్నారు అభిమానులు. హీరోయిన్ మెటీరియల్ అంటూ విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ ఫోటోలు చూసిన తర్వాత ఏంటి ఈమె శేఖర్ కమ్ముల కూతురా అంటూ ఆశ్చర్యపోతున్నారు. తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటున్న వందన రాబోయే రోజుల్లో ఏ రంగంలో స్థిరపడుతుందో చూడాలి.
