భారీ సీక్వెల్స్ ఆలస్యానికి కారణాలేంటి?
సలార్2: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ కు సీక్వెల్ గా రానున్న సలార్2 పై అందరికీ చాలా అంచనాలున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 12:30 PMబాహుబలి సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. ముందు సినిమాను మొదలుపెట్టడం, తర్వాత కథను ఒక పార్ట్ లో చెప్పలేకపోతున్నామని రెండో పార్ట్ ను అనౌన్స్ చేయడం ఫ్యాషనైపోయింది. ఈ సీక్వెల్స్ ట్రెండ్ వల్ల లాభాలు వస్తుండటంతో నిర్మాతలు కూడా వాటిపై బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్ లో పలు సీక్వెల్స్ రావాల్సి ఉండగా, అవన్నీ వేరే వేరే కారణాల వల్ల లేటవుతూ వస్తున్నాయి. అవేంటో చూద్దాం.
సలార్2: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ కు సీక్వెల్ గా రానున్న సలార్2 పై అందరికీ చాలా అంచనాలున్నాయి. అటు ప్రభాస్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల సలార్2 లేటవుతుంది. అసలు సలార్2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదు.
దేవర2: దేవరను అసలు ముందు ఒక సినిమాగానే చేద్దామనుకున్నారు కానీ తర్వాత కథ పెరగడంతో దేవర2 ను ప్లాన్ చేశారు. కొరటాల ఆల్రెడీ దేవర2 స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ, తారక్ ముందుగా ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేసి తర్వాత దేవర2 చేయాలని ఫిక్స్ అవడంతో ఆ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
కల్కి2: కల్కి2898ఏడీ దాదాపు వచ్చి ఏడాదవుతున్నా, ఆ సినిమాకు సీక్వెల్ ఇంకా మొదలవలేదు. కేవలం ఆ సినిమా స్క్రిప్ట్ కోసమే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏడాదికి పైగా టైమ్ తీసుకున్నాడు. నాగ్ అశ్విన్ అంతా రెడీ చేసుకునే టైమ్ కు ప్రభాస్ వేరే సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల కల్కి సీక్వెల్ నెక్ట్స్ ఇయర్ కు పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్, ఫౌజీ తో పాటూ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా పూర్తయ్యాకే ప్రభాస్ కల్కి2 ను మొదలుపెట్టనున్నాడు.
పుష్ప3: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప1, పుష్ప2 ఏ రేంజ్ సక్సెస్ ను అందుకున్నాయో అందరికీ తెలుసు. పుష్ప2 కు సీక్వెల్ గా పుష్ప3 రాంపేజ్ ని కూడా సుకుమార్ అనౌన్స్ చేశాడు. కానీ బన్నీ, సుకుమార్ వేరే సినిమాలకు కమిట్ అవడం వల్ల ఆ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు.
టిల్లు క్యూబ్: డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ సినిమాలతో ఒకదాన్ని మించి మరొక దానితో హిట్లు అందుకున్న సిద్దూ జొన్నలగడ్డ టిల్లూ స్వ్కేర్ కు సీక్వెల్ గా టిల్లూ క్యూబ్ ను కూడా అనౌన్స్ చేశాడు. కానీ టిల్లు క్యూబ్ ఇప్పుడే మొదలయ్యేలా లేదు. దానికి కారణం సిద్దూ జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసు కదాతో బిజీగా ఉండటంతో పాటూ టిల్లూ క్యూబ్ స్క్రిప్ట్ ఇంకా రెడీ అవకపోవడమేనని తెలుస్తోంది.