సీనియర్ భామలు.. ఏదో అనుకుంటే.. మరేదో అయింది
ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్లుగా మంచి గుర్తింపు, క్రేజ్, అభిమానుల్ని సంపాదించుకున్న హీరోయిన్లు పెళ్లి చేసుకుని వివిధ కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు.
By: Tupaki Desk | 26 July 2025 1:00 PM ISTఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్లుగా మంచి గుర్తింపు, క్రేజ్, అభిమానుల్ని సంపాదించుకున్న హీరోయిన్లు పెళ్లి చేసుకుని వివిధ కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత సినిమాపై ప్యాషన్ తో రీఎంట్రీకి ట్రై చేశారు. మంచి కథ చూసుకుని రీఎంట్రీ ఇచ్చి కెరీర్ లో బిజీ అయిపోయి తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని అందుకోవాలని చాలా గట్టిగానే ప్రయత్నించారు.
కానీ ఆ సీనియర్ భామల ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు అనుకుంటున్నారా.? రీసెంట్ గా ఓ ముగ్గురు భామలు టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు తమ సినిమాలతో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ భామలకు రీ ఎంట్రీలో సాలిడ్ హిట్ పడుతుందనుకుంటే తమ రీఎంట్రీలు వారికి, వారి కెరీర్ కు ఏమీ కలిసి రాలేకపోయాయి.
టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి మన్మథుడు, ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అన్షు రీసెంట్ గా సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మజాకా సినిమాలో కీలక పాత్రలో నటించి, ఆ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. కానీ అన్షు నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచింది. మజాకా సినిమా అన్షు ఆశలపై నీళ్లు చల్లింది.
నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాతో లయ రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ కోసం ఇంత కంటే మంచి కథ ఉండదనిపించి తమ్ముడుతో కంబ్యాక్ ఇస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్న లయ పరిస్థతి కూడా అదే. తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ గా మిగిలింది. ఇక రీసెంట్ గా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన జెనీలియా జూనియర్ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. జూనియర్ సినిమాతో జెన్నీకి కూడా సరైన కంబ్యాక్ దక్కలేదు. దీంతో రీఎంట్రీతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూసిన ఈ ముగ్గురు భామలకీ ఏ సినిమాలు తాము కోరుకున్న సక్సెస్ ను అందిస్తాయో చూడాలి.
