ముందే డేట్స్ లాక్.. తర్వాత వాయిదాలు! టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?
టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్ డేట్స్ ఇప్పుడు కేవలం డెసిషన్ గా కాదు, ఇది పూర్తిగా ఒక గేమ్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 30 March 2026 6:46 PM ISTటాలీవుడ్‌లో సినిమాల రిలీజ్ డేట్స్ ఇప్పుడు కేవలం డెసిషన్ గా కాదు, ఇది పూర్తిగా ఒక గేమ్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా డేట్స్ లాక్ చేసి, తర్వాత సినిమాలు ఆ డేట్‌కు రెడీ కాకపోవడం అనే ట్రెండ్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతోంది. గతంలో గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతి స్లాట్‌ను తీసుకోవడం, అదే సమయంలో విశ్వంభర పేరు చర్చల్లోకి రావడం జరిగిన విధానం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడదే ప్యాటర్న్ మరోసారి లెనిన్ మరియు పెద్ది విషయంలో కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది.
పెద్ది వల్ల వాయిదా అని చెప్పిన మేకర్స్
పెద్ది రిలీజ్ వల్ల లెనిన్ ను వాయిదా వేస్తున్నామని మేకర్స్ స్వయంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ది వాయిదా వార్తలొస్తున్న నేపథ్యంలో లెనిన్ ను తీసుకురమ్మని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం లెనిన్ వాయిదాకు అసలు కారణం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అని తెలుస్తోంది. దీంతో ఒక సినిమా వాయిదా పడితే, నిజమైన కారణాన్ని చెప్పకుండా మరో సినిమాను కారణంగా చూపించడం పారదర్శకతపై ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.
అభిమానుల్లో అసంతృప్తి
దీంతో ఫ్యాన్స్ ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ముఖ్యంగా అఖిల్ అభిమానులు వరుసగా డేట్లు మారుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్రకటించిన రిలీజ్ డేట్ అంటే అది ఒక కమీట్మెంట్ అనే భావన అభిమానుల్లో బలంగా ఉంటుంది. కానీ ఆ డేట్ పదే పదే మారితే, ఆ ట్రస్ట్ దెబ్బతింటుంది. అనౌన్స్ చేసిన డేట్ అంటే నిజంగా ఫైనల్ కాదా? అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు, ఇది మార్కెటింగ్ స్ట్రాటజీలో ఉన్న లోపాలను కూడా బయటపెడుతోంది. ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి హైప్ క్రియేట్ చేయడం సులభమే. కానీ అదే హైప్‌ను మెయింటైన్ చేయడం కోసం కంటెంట్ రెడీగా లేకపోతే, వాయిదాలు తప్పవు. ఫలితంగా, మొదట పెంచిన అంచనాలు క్రమంగా తగ్గిపోతాయి.
ఈ వాయిదాలు స్టార్ ఇమేజ్‌పైన కూడా ప్రభావం చూపే అవకాశముంది. రామ్ చరణ్, అఖిల్ లాంటి హీరోల సినిమాలు పదే పదే వాయిదా పడితే, అది వారి ప్లానింగ్ లేదా ప్రాజెక్ట్ ఎంపికపై కూడా ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. ఈ విషయంలో హీరోల ప్రమేయం లేకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఆ ప్రభావాన్ని వారి ఇమేజ్‌తో కలిపి చూస్తారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాను త్వరగా చూడాలని కోరుకుంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం సినిమా ఇంకా పూర్తిగా రెడీ అయి ఉండదు. ఈ గ్యాప్ ను తగ్గించడానికి ప్రొడక్షన్ హౌస్‌లు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
