పవన్, విజయ్, నితిన్.. జులై 4న వచ్చేదెవరు?
టాలీవుడ్ లో ఇప్పటికే తెరకెక్కుతున్న వివిధ సినిమాల మేకర్స్.. ఇంకా తమ చిత్రాల రిలీజ్ డేట్స్ విషయంలో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: Tupaki Desk | 9 Jun 2025 4:27 AMటాలీవుడ్ లో ఇప్పటికే తెరకెక్కుతున్న వివిధ సినిమాల మేకర్స్.. ఇంకా తమ చిత్రాల రిలీజ్ డేట్స్ విషయంలో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అందుకు రకరకాల కారణాలు ఉన్నా.. ఆడియన్స్ మాత్రం విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా.. అంటూ వెయిట్ చేస్తున్నారు.
మరో మూడు రోజుల్లో అంటే జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ.. వాయిదా పడిన విషయం తెలిసిందే. సీజీ వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో తప్పని పరిస్థితుల్లో మరోసారి పోస్ట్ పోన్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ ఆ డేట్ కోసం ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారు.
నిజానికి.. జూన్ 20న కుబేరా.. 27న కన్నప్ప రిలీజ్ లు ఉన్నాయి. ఆ తర్వాత డేట్.. జూలై 4. ఆ రోజే వీరమల్లు రిలీజ్ అవుతుందని రీసెంట్ గా టాక్ వినిపించింది. కానీ అది కూడా డౌటేనని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే జూలై 4న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఇప్పుడు చివరి దశలో ఉంది. దీంతో మూవీని వాయిదా వేసే ఆలోచనలో లేమని నిర్మాత నాగవంశీ రీసెంట్ గా తెలిపారు. ఒకవేళ పవన్ మూవీ డేట్ ఫిక్స్ అయితే అప్పుడు ఆలోచిస్తామని అన్నారు. కానీ వీరమల్లు.. జూలై 4న కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు కనపడడం లేదు.
అలా అని కింగ్ డమ్ రిలీజ్ కు లైన్ క్లియర్ అయిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ సినిమా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక టీజర్, సాంగ్ తప్ప మరో కంటెంట్ ను రిలీజ్ చేయలేదు. జూలై4కు నెల కన్నా తక్కువ సమయం ఉంది. పాన్ ఇండియా మూవీ కనుక భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టాల్సిందే.
మరో ట్విస్ట్ ఏంటంటే.. అనిరుధ్ రవిచందర్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ను పూర్తి చేయలేదట. మరికొద్ది రోజుల్లో ఆయన కంప్లీట్ చేయనున్నారట. అయితే అన్ని అనుకున్నట్లు అయితే.. కింగ్ డమ్ వచ్చేయనుంది. కానీ కాస్త స్పీడ్ గా ప్రమోషన్స్ చేపట్టాలి. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే.. నితిన్ తమ్ముడితో వచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్.
ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ అండ్ వర్క్స్ పూర్తి అయ్యాయని తెలుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ తప్పుకుంటే నితిన్ తమ్ముడు థియేటర్స్ లో సందడి చేయాలని చూస్తున్నారట. మొత్తానికి ఇప్పుడు జూలై 4వ తేదీన పవన్, విజయ్, నితిన్ లో ఎవరు వస్తారనేది క్లారిటీ లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..