Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ ట్రెండ్.. ఖర్చు ఎక్కువే!

టాలీవుడ్ లో ఏ ముహూర్తాన రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేశారో తెలియదు గానీ.. కొన్ని నెలలుగా అదే కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   4 May 2025 2:00 PM IST
Re-Releasing in Style: Why Upgrading Old Films Is Getting Costlier
X

టాలీవుడ్ లో ఏ ముహూర్తాన రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేశారో తెలియదు గానీ.. కొన్ని నెలలుగా అదే కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. కొన్ని ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు.. మరికొన్ని సొంత నిర్ణయాలతో అనేక సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నారు.

అలా ఇప్పటికే పెద్ద సంఖ్యలో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చాలా సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. కొన్ని చిత్రాలు అయితే.. అందరినీ షాక్ కు గురి చేస్తూ రాణించాయి. మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. అలా రీ రిలీజ్ ట్రెండ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు మరిన్ని మూవీస్ రీ రిలీజ్ కానున్నాయి.

అదే సమయంలో రీ రిలీజ్ ల కోసం మూవీలను అప్ గ్రేడ్ చేసేందుకు మేకర్స్ కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు మేకర్స్.. ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు కాస్త ఖర్చు ఎక్కువే అవుతున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన అతడు మూవీ మరికొద్ది రోజుల్లో రీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అప్పుడు థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఆ సినిమా.. టీవీ ప్రీమియర్స్ లో కల్ట్ స్టేటస్ పొందింది. రికార్డు స్థాయిలో అతడు మూవీని చాలా మంది బుల్లితెర ఆడియన్స్ ను చూసే ఉంటారు.

ఇప్పుడు ఆ మూవీని ఐమాక్స్ వెర్షన్ కు అప్ గ్రేడ్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం ఖర్చు భారీగానే అవుతోందట. దీంతో సినిమా కోసం జోరుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని మే 9వ తేదీన రీ రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాను 8K కి అప్ గ్రేడ్ చేసి 3D కి మార్చారు మేకర్స్. దీంతో అది చాలా ఖర్చు వ్యవహారంతో కూడుకున్న విధానమనే చెప్పాలి. అదే సమయంలో రీ రిలీజ్ ల కోసం.. అప్‌ గ్రేడేషన్‌ విషయంలో భారీ ఖర్చు పెట్టడం అవసరమా అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయినా ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్సే సమాధానం!