పేరున్న హీరోలకు షేర్ ..పేరులేని హీరోలు ప్రీగా!
చిన్న సినిమాల నిర్మాణమైతే పూర్తిగా పడిపోయింది. కోవిడ్ మొదలైన నాటి నుంచి నేటి వరకూ అదే సన్నివేశం కనిపిస్తుంది.
By: Tupaki Desk | 23 May 2025 2:00 PM ISTనిర్మాణ వ్యయం పెరిగిపోతుందని నిర్మాతలు ఎప్పటికప్పుడు తమ గోడును వినిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలంతా తమ పారితోషికాలు తగ్గించుకోవాలని అప్పట్లో డిమాండ్ కూడా వ్యక్తమైంది. అందుకు కొంత మంది హీరోలు ముందుకు రాగా మరికొంత మంది విముఖత చూపించారు. దీనికి సంబం ధించి నిర్మాతలంతా సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
మరి వాటిని ఆచరణలో ఎంతవరకూ పెట్టారో తెలియదు కానీ మరోసారి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంశం తెరపైకి వచ్చింది. ఐదారేళ్ల కాలంలో నిర్మాణానికి అదనంగా బడ్జెట్ కేటాయించాల్సి వస్తోందని..ఇదే కొనసాగితే సినిమాలు నిర్మించడం కష్టమని...ప్రత్యామ్నాయంగా మరో వ్యాపారం చూసుకోవడం ఉత్తమంగా కొంత మంది నిర్మాతలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి భయప డుతున్నారన్నది వాస్తవం.
చిన్న సినిమాల నిర్మాణమైతే పూర్తిగా పడిపోయింది. కోవిడ్ మొదలైన నాటి నుంచి నేటి వరకూ అదే సన్నివేశం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి నిర్మాత బయట పడాలంటే? సినిమా నిర్మాణం విధానం మారితే చాలా వరకూ నష్టాలను నివారించొచ్చు. ఇది చిన్న సినిమాకే కాదు. పెద్ద సినిమాకు కూడా వర్తిస్తుంది. ఒక్కో సినిమాకు స్టార్ హీరో కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు.
కానీ హీరో ఇలా పారితోషికంలో కాకుండా రిలీజ్ అనంతరం లాభాలో వాటా వచ్చేలా అగ్రిమెంట్ చేసు కోవడం అన్నది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని కొంత మంది నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. సినిమా హిట్ అయితే హీరోకు వాటాలో షేర్ వస్తుంది. అది రిలీజ్ కు ముందు తీసుకునే పారితో షికం కంటే రెండు..మూడు రెట్లు అధికంగానూ ఉంటుంది. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఇదే ప్రాతిపదికన సినిమాలు చేస్తున్నారు.
టాలీవుడ్ లో మాత్రం ఇంకా అమలులోకి రాలేదు. ఆ సమయం వచ్చిందన్నది నిర్మాతల మాట. మార్కెట్ ఉన్న హీరోలంతా ఇలా చేయగల్గితే నిర్మాతకి సినిమా నిర్మాణ వ్యయం కూడా భారం కాదన్నది నిపుణుల మాట. టైర్ 2 హీరోలు కూడా ఇదే విధానంలో సినిమాలు చేయోచ్చు. కొత్త హీరోలైతే? వాళ్ల కోసమంటూ ప్రేక్షకుడు థియేటర్ కు రాడు. నిర్మాత రిస్క్ మీదనే సినిమా చేయాల్సి ఉంటుంది. కంటెంట్ ఉన్న సినిమా అయితే స్టార్ తో పని లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
తద్వారా హీరో కూడా వెలుగులోకి వస్తున్నాడు. రిలీజ్ అనంతరం లాభంలో కొంత పారితోషికంగా చెల్లించడం అన్నది ఓ ఆప్షన్. సాధారణంగా కొత్త హీరోలైతే సినిమాలో కొంత పెట్టుబడి కూడా పెడుతుంటారు. నిర్మాతతో ముందే అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి! కొత్త హీరోల విషయంలో ఆ సమస్య ఉండదు.
