Begin typing your search above and press return to search.

ట్రిక్స్ పై నిర్మాతల ఫోకస్! అదే కంటెంట్ పై పెడితే?

టాలీవుడ్ కు చెందిన కొందరు నిర్మాతలు సోషల్ మీడియాలో తమ సినిమాలపై హైప్ పెంచుకోవాలనే ప్రయత్నంలో కొత్త ట్రెండ్‌ కు తెరలేపుతున్నారని ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   26 Dec 2025 12:58 PM IST
ట్రిక్స్ పై నిర్మాతల ఫోకస్! అదే కంటెంట్ పై పెడితే?
X

టాలీవుడ్ కు చెందిన కొందరు నిర్మాతలు సోషల్ మీడియాలో తమ సినిమాలపై హైప్ పెంచుకోవాలనే ప్రయత్నంలో కొత్త ట్రెండ్‌ కు తెరలేపుతున్నారని ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేరుగా ఆన్‌ లైన్‌ లో తమ సినిమాకే టికెట్లు కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. హౌస్‌ ఫుల్ బోర్డులు, బుకింగ్ యాప్స్‌ లో ఫుల్ స్టేటస్ ఉండేలా చేస్తున్నారని వినికిడి.

ఇటీవల విడుదలైన కొన్ని చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలకు తొలి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో నిర్మాతలు ఆ ట్రిక్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ప్రొడ్యూసర్స్ అలా చేస్తున్నారని వినికడి. ముఖ్యంగా హైదరాబాద్ లోని మల్టీప్లెక్సులపై అయితే మరింతగా దృష్టి పెట్టారట.

ఎందుకంటే మల్టీప్లెక్స్‌ ల్లో టికెట్ ఆదాయంలో సుమారు 50 శాతం నిర్మాతలకే తిరిగి వస్తుందని చెబుతుంటారు. అందువల్ల ఆన్‌ లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసినా, కొంత మొత్తమైతే తిరిగి వారి ఖాతాలోకే చేరుతుంది. ఏదేమైనా బల్క్ సెల్ఫ్ బుకింగ్స్ చేయడం వల్ల బుక్ మై షో, పేటీఎం లాంటి యాప్స్‌లో షోలు హౌస్‌ఫుల్‌ గా కనిపిస్తున్నాయి!

అదే స్క్రీన్‌ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సినిమా బాగుందేమో.. అందుకే హౌస్ ఫుల్ అవుతున్నాయన్న భావనను క్రియేట్ చేస్తున్నారు. అందులో సక్సెస్ కూడా అవుతున్నారట! రీసెంట్ గా ఈ ట్రెండ్ చూసి మరో సినిమా యూనిట్ కూడా మొదటి, రెండో షోలకు ఇదే పద్ధతి అనుసరించిందన్న ప్రచారం సాగుతోంది.

కానీ థియేటర్స్ లోకి వెళ్లి చూస్తే చాలా సీట్లు ఖాళీగా కనిపించాయట. దీంతో ఆ విషయంపై నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బుకింగ్ ఫుల్.. హాల్ నిల్ అన్నట్లు సీన్ ఉందని చెబుతున్నారు. అదే సమయంలో సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి.. అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరమేంటని కూడా క్వశ్చన్ చేస్తున్నారు.

అలాంటి ట్రిక్స్ తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడతాయని, అదే సినిమా కంటెంట్ బలంగా ఉంటే మౌత్ టాక్ చాలు అని చెబుతున్నారు. ఒకవేళ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్ళాక నిరాశ చెందితే.. నెగిటివ్ టాక్ వేగంగా వ్యాపిస్తుందని అంటున్నారు. అప్పుడు వసూళ్లు కచ్చితంగా పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా.. చివరకు సోమవారం నాడు అసలు విషయం రివీల్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే సెల్ఫ్ బుకింగ్ ద్వారా ఎంత హైప్ క్రియేట్ చేసినా కొన్ని షోలకే చేయగలరు. ఆ తర్వాత జరగని పని. దానికి తోడు వీకెండ్ అయ్యాక.. మౌత్ టాక్ పైనే మూవీస థియేట్రికల్ రన్ ఆధారపడుతుంది. అందుకే ట్రిక్స్ పై పెట్టే ఫోకస్ కంటెంట్ పై పడితే బెటరేమో.