హృతిక్ రోషన్ కెరీర్ లో ఇదే తొలి అనుభవం!
టాలీవుడ్ ని చూసే కోలీవుడ్, శాండిల్ వుడ్ కూడా ఈ విషయంలో అప్ డేట్ అయ్యాయి? అన్నది అంతే వాస్తవం.
By: Srikanth Kontham | 10 Aug 2025 9:53 AM ISTటాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఓపెన్ గ్రౌండ్ లో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఎంతో గొప్పగా జరుపుకునే గొప్ప వేడుక ఇది. సినిమా మొదలైన దగ్గర నుంచి ముగించే వరకూ ఎంతో కష్టపడతారు. ఆ కష్టాన్నంతటిని ఒక్క వేడుకతో టీమ్ అంతా మర్చి పో తుంది. సినిమాకు ఎలా పని చేసారు? షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు? కోపాలు..తాపాలు ఇలా ప్రతీ అంశాన్ని నెమర వేసుకునే రోజు అది. సినిమాలో నటించిన తారాగణమే కాకుండా వేడుకకు ముఖ్య అతిధిగా ఒకరు విచ్చేయడం అన్నది అనవాయితీ. ఇంత గొప్పగా ముందొస్తు వేడుక నిర్వహిచడం అన్నది టాలీవుడ్ కే సాధ్యమైంది.
ఒక్క ప్రెస్ మీట్ తోనే ముగింపు:
టాలీవుడ్ ని చూసే కోలీవుడ్, శాండిల్ వుడ్ కూడా ఈ విషయంలో అప్ డేట్ అయ్యాయి? అన్నది అంతే వాస్తవం. అయితే ఇలాంటి వేడుకలు బాలీవుడ్ లో నిర్వహించరు. సినిమా రిలీజ్ తేదీ దగ్గరపడిందంటే? సింపుల్ గా ఓ చిన్న ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. సినిమాకు సంబంధించిన విశేషా లన్ని అందులోనే షేర్ చేసుకుంటారు. అవసరం మేర కొన్ని టీవీ షోల్లో ప్రమోట్ చేస్తుంటారు. అంతకు మించి అభిమానుల సమక్షంలో వేడుకలు నిర్వహించడం వంటివి ముంబైలో జరగవు.
రణబీర్, షారుక్ తర్వాత అతడే:
ఆ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటుంది? అన్నది రణబీర్ కపూర్, షారుక్ ఖాన్ లాంటి స్టార్లు మాత్రమే చూసా రు. చెన్నైలో `జవాన్` ప్రీ రిలీజ్ ఈవెంట్...హైదరాబాద్ లో `యానిమల్` ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో రణబీర్ కపూర్ ఆ అనుభూతిని పొందారు. తాజాగా అదే ఎక్స్ పీరియన్స్ ని నేడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చూడబోతున్నారు. హృతిక్- ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో `వార్ 2` తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లోని యూసప్ గూడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహిస్తున్నారు.
ఇదే తొలి వేదిక:
ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు నుంచి పదిగంటల వరకూ వేడుక జరగనుంది. సినిమాకు సంబంధించి ఎన్టీఆర్- హృతిక్ ఒకేవేదికను పంచు కోవడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ సినిమా ప్రచారమంతా వేర్వేరుగా చేసారు. ప్రీ రిలీజ్ సందర్భంగా కలిసి ప్రమో ట్ చేయబోతున్నారు. దీంతో భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తారని నిర్వాహకులు భావిస్తు న్నారు. అందుకు తగ్గట్టు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఓ గొప్ప జ్ఞాపకంలా:
ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మొహరించనున్నారు. బస్సులు తిరిగే మార్గాలను మళ్లించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పబ్లిక్ వేదికకు హృతిక్ హాజరవ్వడం ఇదే తొలిసారి. దీంతో ఆయన అభిమానులను ఉద్దేశించి ఎలా ప్రసంగిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. 25 ఏళ్ల హృతిక్ సినీ జీవితంలో ఈ వేడుక ఓ మధుర ఘట్టం కాబోతుంది.
