పవర్‌ఫుల్ క్యారెక్టర్..అయితే ఓకే
బాహుబలి తరువాత తెలుగు సినిమా స్వరూపం సమూలంగా మారింది. బడ్జెట్‌తో పాటు సినిమా బిజినెస కూడా రికార్డు స్థాయికి చేరింది.
By: Tupaki Desk | 18 Jun 2025 7:30 AMబాహుబలి తరువాత తెలుగు సినిమా స్వరూపం సమూలంగా మారింది. బడ్జెట్‌తో పాటు సినిమా బిజినెస కూడా రికార్డు స్థాయికి చేరింది. దీంతో కొత్త కథలు, సరికొత్త కాంబినేషన్‌లు తెరపైకొస్తున్నాయి. మనం చూడమేమో అని కనీసం ఊహించని కాంబినేషన్‌లతో క్రేజీ ప్రాజెక్ట్‌లు పుట్టుకొస్తున్నాయి. అంతే కాకుండా హీరోలు కూడా సరికొత్త పంథాకు అనుగుణంగా మారుతున్నారు. మార్కెట్, డిమాండ్‌ని బట్టి ప్రాజెక్ట్‌లు, పాత్రలని ఎంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు.
పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉందంటే అది హీరో క్యారెక్టరేనా అని ఆలోచించడం లేదు. క్యారెక్టర్‌కున్న పొటెన్షియాలిటీ ఎంత? మనకు అది ఎంత వరకు పనికొస్తుంది? అన్నది మాత్రమే చూసి ఓకే అంటున్నారు. బాహుబలితో రానా విలన్‌గా మారి కొత్త తరహా కథలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కింగ్ నాగార్జున, యువ హీరో కార్తికేయ ఫాలో అవుతున్నారు.
`దేవర` బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న ఎన్టీఆర్ ఇదేఏడాది బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందుతున్న `వార్ 2`లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ది నెగెటివ్ షేడ్స్‌తో సాగే పవర్ ఫుల్ క్యారెక్టర్.
క్యారెక్టర్ నచ్చడం, హృతిక్ రోషన్ తో నువ్వా నేనా అనే స్థాయిలో ఉండటం వల్లే ఎన్టీఆర్ తనది నెగెటివ్ క్యారెక్ట్ అయినా అంగీకరించాడట. ఇదే తరహాలో కింగ్ నాగార్జున `కుబేర`, కూలీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. `కుబేర`లో కథని నడిపించే కీలక కీ రోల్ కాగా, `కూలీ` మూవీలో మాత్రం పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్. కథ చెప్పే ముందే తనది పవర్ ఫుల్ క్యారెక్టర్ అని తెలిసే నాగ్ ఈ సినిమా అంగీకరించారట. ఈ విషయాన్ని ఇటీవల `కుబేర` ప్రమోషన్స్‌లో వెల్లడించారు కూడా.
ఇక యంగ్ హీరో కార్తికేయది ఇదే దారి. 'ఆర్ ఎక్స్ 100' వంటి బ్లాక్ బస్టర్ తో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న కార్తికేయ ఆ తరువాత క్యారెక్టర్, స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో నాని గ్యాంగ్ లీడర్‌లో పవర్ ఫుల్ విలన్‌గా నటించడం తెలిసిందే. ఇదే తరహాలో అజిత్ హీరోగా నటించిన `వలిమై`లోనూ కార్తికేయ విలన్‌గా కనిపించి అదరగొట్టాడు కూడా. నవీన్ చంద్ర కూడా ఆ మధ్య `అరవింద సమేత`లో జాలిరెడ్డిగా కనిపిచడం తెలిసిందే.