మన స్టార్ ప్రొడ్యూసర్స్ నాన్ ఆల్కహాలిక్ స్టోరీ.!
దీనికి తోడు సాధారణంగా ఇండస్ట్రీలో పార్టీలకు కొదవే ఉండదు. ఏ చిన్న సందర్భం వచ్చినా దాన్ని టీమ్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు.
By: Tupaki Desk | 3 April 2025 9:00 AM ISTసినిమా ఇండస్ట్రీ అంటే కొబ్బరి కాయ కొట్టిన దగ్గరి నుంచి మేకర్స్, ఆర్టిస్ట్‌లు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సినిమా ప్రారంభం నుంచి పూర్తయి థియేటర్లలోకి రిలీజై సక్సెస్ అయ్యే వరకు ఓ పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ప్రొడక్షన్ కంపనీలు కూడా ఇదే ఫాలో అవుతూ ప్రతి ఈవెంట్‌ని ఓ పండగా చేస్తూ సెలబ్రేట్ చేస్తుంటారు. సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
దీనికి తోడు సాధారణంగా ఇండస్ట్రీలో పార్టీలకు కొదవే ఉండదు. ఏ చిన్న సందర్భం వచ్చినా దాన్ని టీమ్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో పార్టీలు, గెట్‌టు గెదర్‌లు కూడా ఎక్కువే. బయటికి కనిపించరు కని సినిమా వాళ్లు ప్రతి సారి ఏదో ఒక అకేషన్‌ని ప్రధానంగా పెట్టుకుని పార్టీలు చేసుకోవడం సర్వసాధారణం. అయితే బాలీవుడ్ పార్టీలకు మన టాలీవుడ్ పార్టీలకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది.
అక్కడ పార్టీల్లో అంతా మందేసి చిందేస్తే మన వాళ్లలో ఎక్కువ మంది ఎంజాయ్‌కే ఇష్టపడతారే కానీ మందుని ముట్టుకోరంటే మీరు నమ్ముతారా?.. ఈ విషయంపై చాలా మందిలో అనుమానాలున్నా ఇది మాత్రం పచ్చి నిజం. ఆల్కహాల్ విషయంలో ముఖ్యంగా మన ప్రొడ్యూసర్స్ జెమ్స్ అంతే. ఇండస్ట్రీలో పార్టీలని అత్యధికంగా హోస్ట్ చేసేది ప్రొడ్యూసర్సే. ఎంత పార్టీలు ఏర్పాటు చేసినా కానీ మన ప్రొడ్యూసర్స్‌లో ఎక్కువ మందికి డ్రింకింగ్ హ్యాబిట్ మాత్రం లేదు.
వరుస బ్లాక్ బస్టర్లు అందించే దిల్ రాజు నాన్ ఆల్కహాలిక్. అంతే కాకుండా మైత్రీ నవీన్ కూడా అంతే. ఇక సితార వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు. ఆయకు ఆల్కహాల్క్‌కు పడదు. ఇక పీపుల్ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాధ్ కూడా నాన్ ఆల్కహాలిక్ పర్సనే. ఇక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాత్రం ఎప్పుడో రేర్‌గా పార్టీల్లో చాలా తక్కువ ఆల్కహాల్ తీసుకుంటుంటారట. ఇదీ మన స్టార్ ప్రొడ్యూసర్స్ నాన్ ఆల్కహాలిక్ స్టోరీ.
