స్టార్ హీరోలందరికీ అందమే ఆయుధమా?
ఒకప్పుడు సినిమా అంటే తెరంతా రంగుల మయం. ఒక్క హీరోకి ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండేవారు.
By: Tupaki Desk | 23 July 2025 8:00 PM ISTఒకప్పుడు సినిమా అంటే తెరంతా రంగుల మయం. ఒక్క హీరోకి ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండేవారు. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎక్కువగా కనిపించేవారు. అందాల భామల్నే ఆయుధంగా వాడేవారు. కాల క్రమంలో ఆ ట్రెండ్ కనుమరుగైపోయింది. కొంత మంది దర్శకులు తప్ప చాలా మంది లేడీ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. హీరోయిన్ల విషయంలోనూ అంతే పరిమితంగా ఉంటు న్నారు. కథకు ఎంత అవసరమో అంతే తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ముగ్గురు హీరోల చిత్రాల్లో మాత్రం మరో సారి అందాన్ని కూడా ఆయుధంలా వదులుతున్నట్లు కనిపిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు భామలు హీరోయిన్లగా నటిస్తున్నారు. ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లు ఉండాలని అడగగా మారుతి ఇద్దరు కాదు డార్లింగ్ అంటూ మరో భామని కలిపి ముగ్గురు భామల్ని తీసుకున్నాడు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ లు డార్లింగ్ సరసన నటిస్తున్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా అందాల భామలకు కొదవలేదు. మెయిన్ లీడ్ లో త్రిష నటిస్తుండగా ఇషా చావ్లా, సురభి, ఆషీకా రంగనాధ్ నటిస్తున్నారు. ఈ ముగ్గురు కాకుండా మీనాక్షి చౌదరి కూడా నటిస్తుందనే ప్రచారంలో ఉంది.
అలాగే నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ 2' తెరక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో యధావిధిగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. ఆమెతో పాటు సంయుక్తా మీనన్ కూడా భాగమైంది. బోయపాటి సినిమా అంటే లేడీ క్యారెక్టర్స్ ఇంకా అదనంగా చాలా ఉంటాయి.
అలాగే రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలోనే ఇద్దరు భామలు నటిస్తు న్నారు. ఆషీకా రంగనాధ్ ఇప్పటికే ఓ హీరోయిన్ గా ఎంపికైంది. మరో నాయికగా కేతిక శర్మను పరిశీ లిస్తు న్నారు.
అలాగే యంగ్ హీరో శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజ్ `నారీ నారీ నడుమ మురారీ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలి సిందే. ఇందులో శర్వానికి జోడీగా సంయుక్తా మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లగా నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రంలో నయనతార-క్యాథరీన్ టెస్రా హీరోయిన్లుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా హీరోలంతా మళ్లీ ఇద్దరు...ముగ్గురు భామల మధ్యలో ముద్దుల ప్రియులుగా మారుతున్నారు.
