టాలీవుడ్ బడా సినిమాలు.. ఇంకెప్పుడు రిలీజ్ అవుతాయో?
కానీ ఇప్పుడు మూడు సినిమాలు మాత్రం.. ఇంకా రిలీజ్ విషయంపై క్లారిటీ రావడం లేదు.
By: Tupaki Desk | 6 Jun 2025 8:00 PM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం అనేక బడా సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. మరికొన్ని పూర్తి చేసుకున్నాయి. ఇంకొన్ని రిలీజ్ కు సిద్ధమయ్యాయి. డేట్స్ ను ఖరారు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు మూడు సినిమాలు మాత్రం.. ఇంకా రిలీజ్ విషయంపై క్లారిటీ రావడం లేదు.
అందుకే కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులే. అవి ఇప్పటికే మొదలైనా.. పూర్తి కాకపోవడం వల్ల మేకర్స్ ఇంకా ఎప్పుడు సినిమాను విడుదల చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మూడు సినిమాలు ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కింగ్ డమ్.
ముందుగా విశ్వంభర విషయానికొస్తే.. చిరంజీవి- వశిష్ట కాంబినేషన్ లో రూపొందిన ఆ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందింది. ఇప్పుడు సీజీ వర్క్ జరుగుతోంది. సినిమాలో 70శాతం సీజీ వర్కే ఉంటుందని టాక్. అందుకే వివిధ స్టూడియోలు వర్క్ చేస్తున్నాయి.
ఇంకా పూర్తి అవుట్ పుట్ రాలేదని సమాచారం. అది జరిగాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. మెగాస్టార్ అలాగే చేయమని చెప్పారని టాక్. మరోవైపు, హరిహర వీరమల్లు విడుదలను మరోసారి వాయిదా వేశారు మేకర్స్. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, అందుకే మరికొంత సమయం తీసుకుంటున్నామని తెలిపారు.
కానీ కొత్త డేట్ ను అనౌన్స్ చేయలేదు. త్వరలో ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని మాత్రం చెప్పారు. అయితే విజయ్ దేవరకొండ కింగ్ డమ్.. మూవీ ఇప్పటికే కంప్లీట్ అయింది. కానీ లెంగ్త్ ఇష్యూస్ వచ్చాయని.. క్రిస్పీ వెర్షన్ రెడీ చేసిన తర్వాత మళ్లీ రీషూట్ కు మేకర్స్ వెళ్లారని తెలుస్తోంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉందని సమాచారం.
మొదట సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఆ తర్వాత జులై 4కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఆ రోజు కూడా సినిమా రావడం డౌటేనని అంటున్నారు. కానీ వాయిదా వేసే ఆలోచన లేదని ఇటీవల నాగవంశీ చెప్పారు. ఇప్పుడు జులై 4న వీరమల్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే కింగ్ డమ్ మళ్లీ వాయిదా పడడం పక్కా అని చెప్పవచ్చు. విశ్వంభర దసరాకు వస్తుందని వినికిడి. మరి ఎప్పుడు మూడు సినిమాలు రిలీజ్ అవుతాయో చూడాలి.
