చరిత్రను లైట్ తీస్కున్న టాలీవుడ్!
భారతదేశంలో చెప్పుకోదగ్గ చారిత్రక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. చరిత్ర పాఠాల్ని తిరగేస్తే సినిమాకి కావాల్సిన సరంజామా చాలా ఉంది.
By: Tupaki Desk | 17 April 2025 9:13 AM ISTభారతదేశంలో చెప్పుకోదగ్గ చారిత్రక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. చరిత్ర పాఠాల్ని తిరగేస్తే సినిమాకి కావాల్సిన సరంజామా చాలా ఉంది. కానీ వాటిని టాలీవుడ్ లో ఎవరూ టచ్ చేస్తున్నది లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో చారిత్రక కథలతో సినిమాలు తీయడాన్ని మన దర్శకరచయితలు విస్మరించారనే చెప్పాలి. చరిత్రలో చాలా సంచలన కథలు ఉన్నా వాటి జోలికి వెళ్లకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో ఇది ఊహించని పరిణామం.
తెలుగులో ఇప్పటివరకూ ఐదు హిస్టారికల్ డ్రామాలు మాత్రమే వెండితెరకెక్కించారు. బాహుబలి, రుద్రమదేవి, సైరా నరసింహారెడ్డి, గౌతమి పుత్ర శాతకర్ణి, కంచె లాంటి కొన్ని సినిమాలు మాత్రమే తెలుగులో తెరకెక్కాయి. కానీ ఆ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ని తెలుగు సినిమా ఛేజిక్కించుకున్నా, రైట్ టైమ్ లో చారిత్రక కథల్ని విస్మరించడం ఆశ్చర్యపరుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
నిజానికి క్రేజ్ ఉన్న హిస్టారికల్ డ్రామాల్ని వారియర్ ఎపిక్ స్టోరీలుగా మలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు ఆస్కారం ఉన్నా టాలీవుడ్ లో అలాంటి ప్రయత్నం జరగడం లేదని విశ్లేషిస్తున్నారు. ఇటీవలే ఛత్రపతి శివాజీ వారసుడు శాంభాజీ మహారాజ్ కథను చావా టైటిల్ తో తెరకెక్కించి బాలీవుడ్ అద్భుత విజయాన్ని అందుకుంది. తెలుగు సహా దక్షిణాది భాషల్లోను ఈ చిత్రం మంచి వసూళ్లను దక్కించుకుంది. విక్కీ కౌశల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. తదుపరి ఛత్రపతి శివాజీ విరోచిత కథను టాలీవుడ్ విస్మరించింది. శివాజీ మహారాజ్ కథాంశం దేశవ్యాప్తంగా సోషల్ పాఠం .. అందరికీ తెలిసిన కథ.. కానీ దీనిని తెలుగులో తీయలేదు. ఒకవేళ తెలుగు దర్శకుడు తెరకెక్కించి ఉంటే పాన్ ఇండియాలో వసూళ్లు దక్కేవి కదా? కానీ ఛత్రపతి కథను కూడా బాలీవుడ్ ఎన్ క్యాష్ చేసుకోబోతోంది. ఓవైపు సౌత్ డామినేషన్ అంతకంతకు పెరుగుతున్నా, చరిత్రలో సమున్నతమైన కథాంశాలను తెరకెక్కించడంలో ఇప్పటికీ టాలీవుడ్ వెనకబడిందనడంలో సందేహం లేదు!
