థియేటర్ లేదు, ఓటీటీ లేదు.. నెక్స్ట్ ఏంటి?
ఒకప్పుడు మిడ్ రేంజ్ హీరో సినిమా అంటే ఫస్ట్ వీకెండ్‌కి 6 లేదా 8 కోట్లు షేర్ గ్యారెంటీ. ఇప్పుడు ఫస్ట్ డే కోటి వస్తే పండగ చేసుకునే పరిస్థితి వచ్చింది.
By: Tupaki Desk | 24 April 2026 10:50 AM ISTఒకప్పుడు మిడ్ రేంజ్ హీరో సినిమా అంటే ఫస్ట్ వీకెండ్‌కి 6 లేదా 8 కోట్లు షేర్ గ్యారెంటీ. ఇప్పుడు ఫస్ట్ డే కోటి వస్తే పండగ చేసుకునే పరిస్థితి వచ్చింది. స్టార్ హీరోల సినిమాలు 100 కోట్లు కొడుతుంటే, మిడ్ రేంజ్ మాత్రం 10 కోట్లకే ఆగిపోతోంది. ఈ గ్యాప్ 2024 నుంచి మొదలై 2026కి వచ్చేసరికి కళ్లముందు కనిపిస్తోంది. కానీ ఇది సగం కథ మాత్రమే. అసలు ట్విస్ట్ ఇప్పుడు ఓటీటీలో ఉంది.
కోవిడ్ టైంలో ప్రతి సినిమాకి డిజిటల్ రైట్స్ రూపంలో ఒక బ్యాకప్ ఉండేది. థియేటర్‌లో వర్కౌట్ కాకపోయినా 7 లేదంటే 8 కోట్లకి అమ్మేసి ప్రొడ్యూసర్ బయటపడేవాడు. ఆ ధైర్యంతోనే ఏడాదికి 25 మిడ్ రేంజ్ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ప్లాట్‌ఫామ్స్ స్క్రీన్ మీద లెక్కేసి రేటు చెబుతున్నాయి. థియేటర్‌లో మినిమమ్ 15 కోట్లు గ్రాస్ లేదా సూపర్ హిట్ టాక్ ఉంటేనే 5 కోట్లు ఇస్తాం అని కండిషన్ పెడుతున్నాయి. అంటే థియేటర్ హిట్ కొడితేనే ఓటీటీ డబ్బు. లేదంటే రెండు చోట్లా బోల్తా.
దీంతో ఇండస్ట్రీలో కొత్త సమస్య వచ్చింది. కొన్ని సినిమాల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి, సెన్సార్ కూడా అయిపోయయాయి. కానీ రిలీజ్ డేట్ లేదు. ఎందుకంటే థియేటర్‌లో వదిలితే పబ్లిసిటీకి కోటి దాకా పోతుంది. ఫ్లాప్ టాక్ వస్తే ఓటీటీ రేటు 6 కోట్ల నుంచి 2 కోట్లకి పడిపోతుంది. అటు ఇటు కాకుండా ప్రొడ్యూసర్లు ల్యాబ్‌లోనే సినిమా పెట్టి డీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. 6 నెలలుగా 12 సినిమాలు ఇలా హోల్డ్‌లో ఉన్నాయని టాక్.
ఈ సమస్యలకు తోడు రెమ్యునరేషన్ కూడా పెద్ద తలనొప్పి. 2021లో 12 కోట్లు తీసుకున్న హీరో ఇప్పుడు 7 కోట్లకి వచ్చినా, సినిమా టోటల్ బిజినెస్ 9 కోట్లు దాటడం లేదు. శాటిలైట్ మార్కెట్ కూడా డెడ్. దీంతో నిర్మాతలు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ వద్దు, ప్రాఫిట్ షేర్‌కి వస్తేనే సినిమా అంటున్నారు. కొందరు హీరోలు దిగొస్తున్నారు, కొందరు మార్కెట్ లేదని నేను రేటు తగ్గాలా అని సైలెంట్ అయిపోతున్నారు.
ఏదేమైనా కంటెంట్ తప్ప దారి లేదు. ‘బలగం’ లాంటి సినిమా 2.5 కోట్లతో తీస్తే 26 కోట్లు వసూలు చేసింది. ‘కోర్ట్’ సినిమా చిన్న హీరోతో అవార్డులు కొట్టింది. ఆడియన్స్ క్లియర్‌గా చెబుతున్నారు.. ఇమేజ్ చూడం, కథ బాగుంటే చాలు అంటున్నారు. 200 రూపాయల టికెట్ కొని థియేటర్‌కి రావాలంటే రీజన్ కావాలి. అది ఇవ్వలేని హీరో, ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నా, రెండేళ్లలో లిస్ట్ నుంచి అవుట్. 2026 టాలీవుడ్‌లో ఇదే కొత్త రూల్. మరి ఇలాంటి టైమ్ లో ఏ హీరో క్లిక్ అవుతారో చూడాలి.
