Begin typing your search above and press return to search.

ఫస్ట్ అల్లు అరవింద్.. సెకండ్ సురేష్ బాబు!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీసెంట్ గా ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Jun 2025 12:55 PM IST
ఫస్ట్ అల్లు అరవింద్.. సెకండ్ సురేష్ బాబు!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీసెంట్ గా ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటినా సీఎం చంద్రబాబు నాయుడిని టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు వెళ్లి కలవకపోవడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. దీంతో డిప్యూటీ సాబ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు.

తమకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను అదే విధంగా స్వీకరిస్తానని పవన్ తెలిపారు. ఇకపై తనను ఎవరూ వ్యక్తిగతంగా కలవొద్దని తెలిపారు. ఏం ఉన్నా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే సంప్రదించాలని వెల్లడించారు. తన సొంత చిత్రమైనా సరే అదే జరగాలని ఆదేశించారు. రీసెంట్ గా పవన్ హరిహర వీరమల్లు మేకర్స్ అలాగే చేసిన విషయం తెలిసిందే.

అయితే పవన్ సీరియస్ అయిన తర్వాత పలువురు నిర్మాతలు స్పందించారు. ఆయన సూచనలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు సీఎం చంద్రబాబుతో కొంత మంది సినీ ప్రముఖులు భేటీ అవ్వాలని ఇటీవల నిర్ణయించారు. జూన్ 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆ సమావేశం జరగనుంది.

సినీ పరిశ్రమ అభివృద్ధి, ఇటీవల పరిణామాలపై చర్చ జరగనుండగా.. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ సారధ్యం వహించనున్నారని సమాచారం. అదే సమయంలో సమావేశానికి ఎవరెవరు వస్తున్నారని రీసెంట్ గా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాట్సాప్ గ్రూప్ లో నిర్మాత సుప్రియ రీసెంట్ గా మెసేజ్ చేశారని టాక్ వినిపిస్తోంది.

ఆ మెసేజ్ పెట్టిన వెంటనే ఫస్ట్ రెస్పాండ్ అయిన ఇద్దరు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు అని టాక్. దీంతో ఒక్కసారిగా గ్రూప్ లో ఉన్నవాళ్లు షాక్ అయ్యారని తెలుస్తోంది. అందుకు రీజన్.. వారు ఎప్పుడూ ఆ గ్రూప్ లో ఏ మెసేజ్ పెట్టినా అంత వేగంగా రెస్పాండ్ అవ్వరట. ఎప్పుడో ఏదో సందర్భంలో రిప్లై ఇస్తుంటారని సమాచారం.

ఇప్పుడు మాత్రం వెంటనే రెస్పాండ్ అవ్వడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే.. అది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ కదా.. సురేష్ బాబు సినిమాలు నిర్మించడం ఆపేసి చాలా కాలం అయింది. కానీ ఇప్పటికీ ఆయన ఆ గ్రూప్ లో ఉన్నారన్నమాట. అల్లు అరవింద్ మాత్రం ప్రస్తుతం గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లపై సినిమాలు నిర్మిస్తున్నారు. అలా ఈ వార్త ద్వారా వీరిద్దరూ సీఎం మీట్ కు వెళ్తున్నారని క్లారిటీ వచ్చేసింది.