Begin typing your search above and press return to search.

ట్రెండ్ పాన్ ఇండియా అయినా టాలీవుడ్ మార్క్!

టాలీవుడ్ మాస్ ని బాలీవుడ్ కి సైతం ప‌రిచ‌యం అవుతోంది ఇప్పుడిప్పుడే. ఇటీవ‌లే `జాట్` తో ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమా చేసి తెలుగు సినిమా ఫార్ములా ఇదీ అని అక్కడ నిరూపించాడు గోపీచంద్ మ‌లినేని.

By:  Tupaki Desk   |   28 April 2025 2:00 AM IST
Item Song Trends In India
X

టాలీవుడ్ మాస్ ని బాలీవుడ్ కి సైతం ప‌రిచ‌యం అవుతోంది ఇప్పుడిప్పుడే. ఇటీవ‌లే `జాట్` తో ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమా చేసి తెలుగు సినిమా ఫార్ములా ఇదీ అని అక్కడ నిరూపించాడు గోపీచంద్ మ‌లినేని. ఈ సినిమాకు ఉత్త‌రాది రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మాస్ ఆడియ‌న్స్ ను కనెక్ట్ చేయ‌డంలో నూరుపాళ్లు స‌క్సెస్ అయింది. ఇలాంటి క‌మ‌ర్శియాల్టీ బాలీవుడ్ లో క‌నిపించ‌దు.

అక్క‌డ మేకింగ్ స్టైల్ వేరు. టాలీవుడ్ స్టైల్ వేర‌ని ప్రూవ్ చేసారు. టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో సైతం ఐటం పాట‌ల‌తో ఉత్త‌రాదిని ఏ రేంజ్ లో ఊపుతున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. పుష్ప లో ఊ అంటావా మావ పాట అక్క‌డ ఏ రేంజ్ ఊపు తెచ్చిందే తెలిసిందే. నార్త్ లో సైతం రీల్స్ హ‌ల్చ‌ల్ చేసాయి అటుపై `పుష్ప 2` లో కిసిక్ పాటే అంతే క‌నెక్ట్ అయింది.

అంత‌కు ముందు `కేజీఎఫ్` లోనూ స్పెష‌ల్ సాంగ్ తో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా స్టెప్పు ల‌కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌ల్లికా షెరావ‌త్, మ‌లైకా అరోరా దిగొచ్చిన‌ట్లే అనిపించింది. ప్రస్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో చేస్తోన్న `డ్రాగ‌న్` లోనూ అలాంటి స్పెష‌ల్ సాంగ్ ఒక‌టి ప్లాన్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంద‌ని స‌మాచారం. ఈ పాట కోసం శ్రుతి హాస‌న్ ని రంగంలోకి దించుతున్నారు.

అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న `పెద్ది` చిత్రంలో సైతం బుచ్చిబాబు ఇలాంటి ఛాన్స్ తీసుకునే అవ‌కాశం ఉంది. గ్లోబ‌ల్ స్టార్ తో ప‌క్కా మాస్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. అలాంట‌ప్పుడు హీటెక్కించే ఐటం పాట లేకుండా `పెద్ది` ఉంటుందా? లేక‌పోతే అభిమానులు ఊరుకుంటారా? ఇలా పాన్ ఇండియా చిత్రాల్లో సైతం మేక‌ర్స్ టాలీవుడ్ కి కలిసొచ్చిన ఐటం సాంగ్ ను జ‌త చేస్తూ ఇండియాని అల్లాడిస్తున్నారు.