Begin typing your search above and press return to search.

కన్నప్ప Vs కుబేర Vs రాజా సాబ్.. బజ్ ఎలా ఉందంటే..?

టాలీవుడ్ మూవీ లవర్స్ కు వరుస అప్డేట్లే అప్డేట్లు. అప్ కమింగ్ మూవీస్ కన్నప్ప, కుబేర, రాజా సాబ్ నుంచి ఆయా మేకర్స్ వీడియో అప్డేట్స్ ను రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 11:20 PM IST
కన్నప్ప Vs కుబేర Vs రాజా సాబ్.. బజ్ ఎలా ఉందంటే..?
X

టాలీవుడ్ మూవీ లవర్స్ కు వరుస అప్డేట్లే అప్డేట్లు. అప్ కమింగ్ మూవీస్ కన్నప్ప, కుబేర, రాజా సాబ్ నుంచి ఆయా మేకర్స్ వీడియో అప్డేట్స్ ను రిలీజ్ చేశారు. మొన్న కన్నప్ప ట్రైలర్ రాగా.. నిన్న రాత్రి కుబేర ట్రైలర్ రిలీజైంది. ఇప్పుడు రాజా సాబ్ టీజర్ విడుదలైంది. మూడు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని సందడి చేస్తున్నాయి.

మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ట్రైలర్ గురించి చూసుకుంటే.. హీరో విష్ణు ముందు నుంచి భారీ సినిమా, పెద్ద ప్రాజెక్ట్ అనే చెబుతున్నారు. అందుకు తగ్గట్లే సినిమాను తెరకెక్కించినట్లు ఇప్పుడు ట్రైలర్ లో క్లియర్ గా కనబడుతోంది. అందరూ షాక్ అయ్యేలా కంటెంట్.. సినిమాలో ఉన్నట్టు అర్థమవుతోంది.

ఎక్కడా ఎవరూ వేలెత్తి చూపించే ఛాన్స్ దొరకలేదు. అయితే ఎక్కడ సందు దొరికితే ట్రోల్ చేద్దామని చూసే వాళ్లకు.. విష్ణు మాత్రం ట్రైలర్ ద్వారా ఛాన్స్ ఇవ్వలేదు. అలా ట్రైలర్ ఫుల్ సక్సెస్ అయింది. ఓవరాల్ మూవీ కూడా ఆ విధంగానే ఉంటే.. మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఇప్పుడు కుబేర విషయానికొస్తే.. ట్రైలర్ చూస్తే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ అని ఎవరూ అనుకోలేం. ఎందుకంటే ఆయన సినిమాలు ఎప్పుడూ సెపరేట్ అండ్ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు కుబేర మాత్రం అలా ఉన్నట్లు తెలియడం లేదు. ఆయన ఇప్పటికే తీసిన సినిమాలకు భిన్నంగా ఉంది.

కంప్లీట్ కమర్షియల్ యాంగిల్ లో కుబేరను తీసినట్లు అర్థమవుతోంది. అలా తన ట్రైలర్ అండ్ వర్క్ తో శేఖర్ కమ్ముల చిన్నపాటి షాక్ ఇచ్చారనే చెప్పాలి. మొన్న కన్నప్పతో విష్ణు కంటెంట్ విషయంలో షాక్ ఇవ్వగా.. శేఖర్ కమ్ముల కూడా అదే వేలో ఇచ్చినట్లు కనిపించారు. ఇప్పుడు రాజా సాబ్ తో మరింతగా షాకయ్యారు ఆడియన్స్.

ఎందుకంటే.. సినిమాపై ఇప్పటికీ నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. మారుతితో సినిమా చేయడమేంటని కొందరు కామెంట్ చేయగా.. సినిమా లేట్ అవ్వడంతో ప్రొడక్షన్ హౌస్ పై మరికొందరు విమర్శలు గుప్పించారు. కానీ ట్రైలర్ చూస్తే ఎందుకు లేట్ అయిందో తెలుస్తోంది. వీఎఫ్ ఎక్స్ వర్క్ వల్లేనని అర్థమవుతుంది.

ట్రైలర్ లో వీఎఫ్ ఎక్స్ మాత్రం అదిరిపోయింది. విజువల్స్ సూపర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా మారుతి తన టాలెంట్ ఏంటో చూపించారు. అలా కన్నప్పతో మంచు విష్ణు.. కుబేరతో శేఖర్ కమ్ముల.. రాజా సాబ్ తో మారుతి సినీ ప్రియులకు పాజిటివ్ షాక్స్ ఇచ్చారు. తమ అప్డేట్స్ తో ఆడియన్స్ లో మరింత బజ్ క్రియేట్ చేశారు. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.