హీరోలందరి టార్గెట్ 'జూన్'..ఎవరి దమ్మెంత?
సినిమా రిలీజ్ ల విషయంలో సన్నివేశం ఎలా ఉంటుందంటే? అయితే అతి వృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 29 May 2025 9:51 AMసినిమా రిలీజ్ ల విషయంలో సన్నివేశం ఎలా ఉంటుందంటే? అయితే అతి వృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లే కనిపిస్తుంది. రిలీజ్ అయితే అన్ని సినిమాలు ఒకే సారి రిలీజ్ అవుతాయి. లేదంటే రిలీజ్ లు లేక థియేటర్లన్నీ వెలవెలబోతుంటాయి. ఇప్పటివరకూ థియేటర్ వెళ్లి చూద్దామంటే ఒక్క సరైన సినిమా కూడా కనిపించలేదు. రిలీజ్ లు అన్ని కూడా జూన్ లోనే ఉన్నాయి.
సినిమా సినిమా కి వారం గ్యాప్ ఉన్నా? నెలంతా సినిమాలు ఉండటం అన్నది చాలా వరకూ నష్టంగానే ఉంటుంది. రిలీజ్ అనంతరం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే జనాలంతా కుదిరిన రోజు సినిమా కు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే అన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే? ఆ తర్వాత థియేటర్లు సర్దుబాటు కాక ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు తలెత్తుంటాయి. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కలెక్షన్లు తక్కువగా ఉంటున్నాయి అంటే కారణం పోటీ ఉండటం...థియేటర్లు సవ్యంగా సర్దుబాటు కాకపోవడంతోనే అన్నది తెలిసిందే.
తాజాగా రేపు బైరవం, షష్టిపూర్తి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. . మహేష్ 'ఖలేజా' కూడా రీరిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు టికెట్లు బాగానే బుక్ అవుతున్నాయి. 'థగ్ లైఫ్' జూన్ 5న భారీ అంచనా ల మధ్య రిలీజ్ అవుతుంది. వారం రోజుల్లోనే 12న 'హరిహరవీరమల్లు' రిలీజ్ అవుతుంది.ఇది రిలీజ్ అయిందంటే 'థగ్ లైఫ్' కి థియేటర్లు తగ్గిపోతాయి.
ఆ ప్రభావం 'భైరవం' పై కూడా పడుతుంది. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా వీరమల్లు కారణంగా కొన్ని మేజర్ థియేటర్లు కోల్పోవల్సి వస్తుంది. అటుపై మరో వారంలో జూన్ 20న 'కుభేర' రిలీజ్ అవుతుంది. అప్పుడు పరిస్థితి మరింత జఠిలంగా మారుతుంది. ఈసినిమా కూడా భారీ అంచనాల మద్య రిలీజ్ అవుతుంది. అప్పుడు వీరమల్లు కూడా లైన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆపైవారం అంటే జూన్ 27న మంచు విష్ణు 'కన్నప్ప' పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఇలా జూన్ లో వరుసగా రిలీజ్ లు ఉండటంతో? థియేటర్ల సర్దుబాటు ఎలా జరుగుతంది? అన్నది ఆసక్తికరంగా మారింది.