ఈ సారైనా ఆ ముగ్గురు నిలదొక్కుకుంటారా?
నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన రాబిన్‌హుడ్ సినిమా అతన్ని బాగా డిజప్పాయింట్ చేసింది.
By: Tupaki Desk | 21 April 2025 12:56 PM ISTనితిన్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన రాబిన్‌హుడ్ సినిమా అతన్ని బాగా డిజప్పాయింట్ చేసింది. దీంతో ఇప్పుడు నితిన్ తన ఆశలన్నింటినీ తమ్ముడు సినిమాపై పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ ఇప్పటికే పలు వాయిదాలు పడుతూ లేటవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
జులై 4న తమ్ముడు సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ త్వరలోనే దీనికి ప్రకటన వచ్చే ఛాన్సుంది. కెరీర్ లో వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్న నితిన్ కు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ అవసరం చాలా ఉంది. అందుకే నితిన్ తమ్ముడు సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.
ఇంకా చెప్పాలంటే తమ్ముడు సినిమా నితిన్ కు డూ ఆర్ డై లాంటిది. ఈ సినిమాతో ఎలాగైనా నితిన్ హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అప్పుడే తన మార్కెట్ కొంచెం కుదుటపడుతుంది. జులై వరకు టైముంది కాబట్టి సినిమాను బాగా ప్రమోట్ చేసి ఆడియన్స్ లోకి తీసుకెళ్లి పాజిటివ్ బజ్ తీసుకురాగలిగితే అది ఓపెనింగ్స్ కు ఉపయోగపడే ఛాన్సుంది. రాబిన్‌హుడ్ రిలీజ్ చేసిన వెంటనే రిలీజ్ చేస్తే ఈ ఎఫెక్ట్ తమ్ముడు ఓపెనింగ్స్ మీద పడే ఛాన్సుంది. అందుకే దిల్ రాజు తెలివిగా తమ్ముడుని జులైకి ప్లాన్ చేశాడు.
అయితే నితిన్ లానే రవితేజ్, మెగాస్టార్ చిరంజీవి కూడా తమ గత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాపునే ఎదుర్కొన్నారు. నితిన్ లానే రవితేజ, చిరంజీవికి కూడా ఇప్పుడు కెరీర్లో అర్జెంటు గా హిట్టు కావాల్సిన పరిస్థితి. అయితే అనుకోకుండా వీరంతా ఇప్పుడు కేవలం వారం, రెండు వారాల గ్యాపులోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
జులై 4న తమ్ముడు సినిమా వస్తుండగా, రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా జులై 18న రిలీజ్ రానుంది. ఇక చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర జులై 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. మరి ఈ సారైనా ఈ ముగ్గురూ అనుకున్న ఫలితాన్ని అందుకుని హిట్ కొట్టి తమ మార్కెట్ ను పెంచుకుంటారేమో చూడాలి.
