హీరోయిన్ కష్టాలు ఇప్పట్లో లేనట్లే!
టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా? కొరత కనిపిస్తూనే ఉంటుంది. కొత్త భామలు ఎప్పటికప్పుడు దిగుమతవుతుంటారు.
By: Tupaki Desk | 6 Jun 2025 8:30 AM ISTటాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా? కొరత కనిపిస్తూనే ఉంటుంది. కొత్త భామలు ఎప్పటికప్పుడు దిగుమతవుతుంటారు. హీరోయిన్లు అంటే ఎక్కువగా నార్త్ భామలే కనిపిస్తుంటారు. అయితే కొంత కాలంగా నార్త్ భామలకు తెలుగులో అంతగా ప్రాధాన్యత కనిపించలేదు. సౌత్ భామల ప్రాధాన్యం పెరగడంతో నార్త్ భామల వైపు చూసే వారు తక్కువయ్యారు. దక్షిణాది నుంచైతే నేచురల్ బ్యూటీలు....నటనలో సహజత్వం కనిపిస్తుంది కొంత కాలంగా సౌత్ భామలకు పెద్ద పీట వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హీరోయిన్ల కొరత తగ్గిందనే మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భామలను ఎంపిక చేసుకునేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వచ్చే రెండేళ్ల వరకూ హీరోయిన్ల ఇబ్బందులుండవ్ అనే మాట వినిపిస్తుంది. భాగ్య శ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్, ఇమ్మాన్వీ , శ్రీలీల, సంయుక్తా మీనన్, ప్రియాంక మోహనన్ లాంటి భామలకు ఈ రెండేళ్లు తిరుగుండదు. 'మిస్టర్ బచ్చన్' తో పరిచయమైన భాగ్య శ్రీ బోర్సే తొలి సినిమా ప్లాప్ అయిన చేతి నిండా అవకాశాలతో బిజీగా ఉంది.
'కింగ్ డమ్' లో నటిస్తుంది. ఇదిగాక మరో రెండు..మూడు క్రేజీ ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది. మీడియాం రేంజ్ హీరోలకు ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ గా మారింది. డ్రాగన్ తో రుక్మిణీ వసంత్ లాంచ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే అమ్మడు వరుస ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తుందనే సంకేతాలు అందుతున్నాయి. అందం..అభినయం రుక్మిణీని టాలీవుడ్లో అగ్రస్థానంలో కూర్చోబెట్టే అవకాశం ఉంది. అలాగే 'పౌజీ' తో పరిచయమవుతోన్న ఇమ్మాన్వీ కూడా అదే వేగంతో ఛాన్సులందుకుంటుంది.
'డ్రాగన్' తో పరిచయమైన కయాదు లోహర్ కి టాలీవుడ్ క్రేజ్ తో స్టార్ హీరోలతో ఛాన్స్ లందుకుంటుంది. అలాగే ఆషీకా రంగనాధ్ ఆరంభంలో స్లోగా ఉన్నా ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతోంది. కేతిక శర్మ 'సింగిల్' సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయింది. అమ్మడికి యువతలో క్రేజ్ రెట్టింపు అవ్వడంతో కొత్త అవకాశాలు ఒడిసి పట్టుకుంది. ఇదే వేవ్ లో ఇవానా కూడా కనిపిస్తోంది. వీళ్లతో పాటు సీనియర్ భామలు స్టార్ హీరోలతో ఎలాగూ తెరపై కనిపిస్తుంటారు. మొత్తంగా సీనియర్...జూనియర్ బ్యూటీలతో ఈ రెండేళ్లు భర్తీ చేయోచ్చని ఇండస్ట్రీ భావిస్తోంది.
