నెగిటివ్ రోల్స్ పై కన్నేసిన భామలు!
ఇప్పటికే పలువురు హీరోయిన్లు విలన్ గా మారి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో ఆడియన్స్ ను అలరించారు.
By: Tupaki Desk | 13 July 2025 4:00 AM ISTస్క్రీన్ ను కలర్‌ఫుల్ గా మార్చడం, తమ గ్లామర్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేయడమే కాదు, అవసరమైతే విలన్ గా కూడా మారడానికి రెడీ అవుతున్నారు ఇండియన్ భామలు. మంచి కాంబినేషనో లేదంటే మంచి కథో రావాలి కానీ నెగిటివ్ క్యారెక్టర్లు అయినా సరే సై అంటున్నారు హీరోయిన్లు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు విలన్ గా మారి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో ఆడియన్స్ ను అలరించారు.
సీనియర్ హీరోయిన్లు రమ్యకృష్ణ, మీనా, సౌందర్య హీరోయిన్ గా నటిస్తూ కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే నెగిటివ్ రోల్ ఉన్న క్యారెక్టర్ చేసి ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తమన్నా, వరలక్ష్మి శరత్ కుమార్, త్రిష, రెజీనా, ప్రియమణి, రీమాసేన్, పాయల్ రాజ్‌పుత్, సంయుక్త మీనన్ కూడా అదే దారిలో వెళ్లి ఆడియన్స్ ను సర్‌ప్రైజ్ చేశారు.
ఇక అసలు విషయానికొస్తే ఇప్పుడు మరోసారి వెండితెరపై స్టార్ హీరోయిన్లు గా రాణిస్తున్న భామలు నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే అది ఒక హీరోయిన్ మాత్రమే కాదు. టాలీవుడ్ నుంచి రాబోతున్న మూడు పెద్ద సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ పోషించబోతున్నారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.
ఆల్రెడీ కెరీర్లో స్టార్ హీరోయిన్లుగా మంచి పేరు, క్రేజ్ ఉన్న వాళ్లే ఆ నెగిటివ్ రోల్స్ చేస్తున్నారని కూడా అంటున్నారు. హీరోయిన్లుగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వారు ఈ నెగిటివ్ రోల్స్ చేస్తుండటంతో ఆ హీరోయిన్లు ఎవరా? ఆ సినిమాలేంటా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటివరకు హీరోయిన్లుగా సత్తా చాటిన ఈ భామలు ఇప్పుడు కెరీర్లో కొత్తదనం ట్రై చేసి ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నారట.
