భాగ్య శ్రీ బోర్సే ప్రయాణం ఆ భామల్ని తలపిస్తోందా?
టాలీవుడ్ లో కృతిశెట్టి, పూజాహెగ్డే, శ్రీలీల జర్నీ ఎలా సాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి న కొత్తలో ఓవెలుగు వెలిగారు.
By: Tupaki Desk | 4 July 2025 8:00 PM ISTటాలీవుడ్ లో కృతిశెట్టి, పూజాహెగ్డే, శ్రీలీల జర్నీ ఎలా సాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి న కొత్తలో ఓవెలుగు వెలిగారు. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకున్నారు. కృతి శెట్టి తొలి సినిమా `ఉప్పెన`తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ సక్సెస్ ఊపులో వరుసగా అవకాశాలు అం దుకుంది. కానీ వైఫల్యాలు అంతే వేగంగా వెనక్కి నెట్టాయి. దీంతో అమ్మడు కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. అక్కడా కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళ్ లోనే కమిట్ మెంట్లు కనిపిస్తున్నాయి. మధ్యలో మాలీవుడ్ ని టచ్ చేసింది.
ముంబై బ్యూటీ పూజాహెగ్డే ప్రయాణం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. అందం, అభినయంతో పాటు అమ్మడికి కొన్ని సక్సెస్ లు కలిసొచ్చాయి. అదే జోష్ లో వచ్చిన తె లుగు అవకాశాల్ని కాదని బాలీవుడ్ కి మళ్లీ కంబ్యా క్ అయింది. కానీ తెలుగులో మాత్రం ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. తానెంత ప్రయత్ని స్తున్నా? ఇంత వరకూ మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. దీంతో తమిళ సినిమాలతోనే సరి పెట్టుకోవాల్సి వస్తోంది.
తెలుగు అమ్మాయి శ్రీలీల ప్రయాణం కూడా ఇలాగే కనిపిస్తుంది. ఓ చిన్న సినిమాతో పరిచయమైన అమ్మడు టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వడం ఖాయమనుకున్నారు. ఆ రకంగా కొన్ని సక్సెస్ లు కూడా అందుకుంది. కెరీర్ కాస్త నెమ్మదించినా? అవకాశాలు వుస్తున్నాయి. కానీ వాటినిప్పుడు వద్దనుకుని ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది. తమిళ్, హిందీ చిత్రాలపైనే ఫోకస్ పెడుతుంది. `లెనిన్` సినిమాలో ఛాన్సును చేతులారా వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
మరో ముంబై బ్యూటీ భాగ్య శ్రీ ప్రయాణం ఇప్పుడీ ముగ్గురు బ్యూటీలకు కాస్త అటు ఇటుగా ఉంది. ఇంత వరకూ అమ్మడి ఖాతాలో ఒక్క హిట్ సినిమా లేదు. తొలి సినిమా `మిస్టర్ బచ్చన్` ప్లాప్ అయింది. కానీ ఛాన్సులు మాత్రం పుల్గా ఉన్నాయి. విజయ్ సరసన `కింగ్ డమ్` లో నటిస్తోంది. ఇది గాక మరో రెండు సినిమాలకు సైన్ చేసింది. ఖాళీ సమయంలో కొత్త కథలు వింటోంది. సాధారణంగా సక్సెస్ లేకుండా ఇన్ని అవకాశాలు రావడం అంటే అద్భుతాలు జరిగితే తప్ప సాధ్యం కాదు. ఆ రకంగా భాగ్య శ్రీని లక్కీ గాళ్ అనాల్సిందే.
