దర్శక-నిర్మాత మధ్య హీరోయిన్ పంచాయతీ!
ఇండస్ట్రీకి కొత్త వాళ్లు వచ్చే కొద్ది పాత వాళ్లు కనుమరుగవుతారు. ఫాంలో ఉన్న పాతొళ్లు అంతా కొనసాగు తుంటారు.
By: Tupaki Desk | 1 Aug 2025 8:00 PM ISTఇండస్ట్రీకి కొత్త వాళ్లు వచ్చే కొద్ది పాత వాళ్లు కనుమరుగవుతారు. ఫాంలో ఉన్న పాతొళ్లు అంతా కొనసాగు తుంటారు. ఫాం కోల్పోయిన వారంతా తిరుగు పయనమవుతారు. ఇది ఏ పరిశ్రమలోనైనా సహజం జరిగే ప్రక్రియ. తాజాగా ఈ ప్రక్రియ విషయంలో టాలీవుడ్ లో ఓ ఇద్దరి మధ్య ఘర్ణణ వాతావరణానికి దారి తీసి నట్లు వెలుగులోకి వచ్చింది. ఇటీవలే కాస్త పేరున్న నటుడి తో ఓ చిన్న నిర్మాత సినిమా మొదలు పెట్టా డు. ఆ సినిమా డైరెక్టర్ మాత్రం గతంలో కొన్ని సినిమాలకు పని చేసాడు. అతడికి స్టార్ హీరోలతో కూడా మంచి పరిచయాలున్నాయి.
ఇరకాటంలో హీరోయిన్ ఎంట్రీ
ఆ రిలేషన్ షిప్ తో స్టార్స్ తో అవకాశం రాలేదు గానీ...ఇండస్ట్రీలో తానంటే మాత్రం ఓ గుర్తింపు ఉంది. ఆ హీరో... నిర్మాత కూడా సినిమా మొదలు పెట్టడానికి కారణం కూడా ఆ ఇమేజే. ఆ కారణమే ఇప్పుడా నిర్మా తను ఇరకాటంలో పడేసింది. హీరోకి పేరుంది...డైరెక్టర్ కి గుర్తింపు ఉంది. దీంతో సినిమా కోసం తాను పెద్దగా ప్రయాస పడాల్సిన పనిలేదనే ధీమాలో ఉన్నాడు. అయితే హీరోయిన్ విషయం లోనే నిర్మాత- దర్శకుడి మధ్య సమస్య తలెత్తి వాగ్వివాదానికి దారి తీసినట్లు తెలిసింది.
ఇద్దరి మధ్యా మూడో వ్యక్తి
ఆ యువ నటు డికి జోడీగా హీరోయిన్ గా ఫాంలో ఉన్న ఓ నటిని తీసుకుందామని దర్శకుడు భావించాడుట. పారితో షికంగా కోటి వరకూ ఆమెకే ఖర్చు అవుతుందనే ప్రపోజల్ పెట్టాడుట. దీనికి నిర్మాత ససే మిరా అన్నాడుట. కోటి ఆమెకివ్వడం ఎందుకు? 40 లక్షలిస్తే మలయాళం నుంచి అద్భుతమైనా హీరోయిన్ వస్తుంది? కోటి లో సినిమా పూర్తి చేయోచ్చని తన వెర్షన్ వినిపించాడుట. ఇలా దర్శక-నిర్మాతల మధ్య క్లాష్ రావడం తో గంటన్నర పాటు సీరియస్ గా చిన్నపాటి పంచాయతీనే జరిగిందిట.
వాదన సమతూకంగానే
పాత హీరోయిన్లకు ఇప్పుడు క్రేజ్ ఎలా ఉంది? నవతరం భామలతో ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఎలా ఉందనే అంశాన్ని బేరీజు వేసుకున్నారుట. ఈ విషయంలో ఇద్దరి వాదన సమతూకంగానే కనిపించిందని మధ్య వర్తులు నిర్ణయించి పంచాయతీని ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రొడక్షన్ టీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలె క్కించే ప్రణాళిక సిద్దం చేస్తన్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి క్లాషెస్ సహజం. కానీ అన్ని ప్రాజెక్ట్ లు తిరిగి పట్టాలెక్కడం మాత్రం సాధ్యం పడదు. సగానికి పైగా ప్రాజెక్ట్ లు క్లాషెస్ తలెత్తితే మధ్యలోనే నిలిచి పోతుంటాయి. అది ప్రొడక్షన్ పరంగా కావొచ్చు...క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా కావొచ్చు.
