Begin typing your search above and press return to search.

సమంత పెళ్లి.. హీరోయిన్స్ మాత్రమేనా హీరోలు స్పందించరా?

నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు తన ప్రియుడు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 Dec 2025 11:19 AM IST
సమంత పెళ్లి.. హీరోయిన్స్ మాత్రమేనా హీరోలు స్పందించరా?
X

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు తన ప్రియుడు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది. అటు రాజ్ నిడిమోరుకి కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. సమంతా 2021 అక్టోబర్ 2న తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకోగా.. సమంత విడాకులు తీసుకున్న ఏడాది తర్వాత రాజ్ కూడా తన భార్య శ్యామలీ దేకి విడాకులు ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం ట్రెండింగ్ లో నిలిచింది. కారణం ఫ్యామిలీ మెన్ - 2 సిరీస్ లో సమంతా నటించిన తర్వాతే ఆమెకు తన భర్త నాగచైతన్య విడాకులు ఇచ్చారనే వార్తలు జోరుగా వినిపించాయి. దీనికి తోడు అదే సమయంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. అందుకే రాజ్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చారనీ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

ఇకపోతే అప్పటి నుంచీ వీరిద్దరూ చట్టాపట్టా లేసుకొని తిరుగుతూ రూమర్డ్ కపుల్స్ గా పేరు సొంతం చేసుకున్నారు . కానీ ఎట్టకేలకు డిసెంబర్ 1న వివాహ బంధంలోకి అడుగుపెట్టి రూమర్స్ అన్నింటిని నిజం చేశారు. ఇకపోతే సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు వివాహం చేసుకున్నారు అంటే ఆ వివాహ వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు హాజరవుతూ.. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. మరి కొంత మంది పెళ్ళికి వెళ్లలేని పక్షంలో సోషల్ మీడియా ద్వారా అయినా ఆ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యంగా హీరో హీరోయిన్ అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సమంత సాదాసీదా హీరోయిన్ కాదు.. ఒక టాప్ హీరోయిన్.. పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరి హీరోలతో ఆమె చాలా క్లోజ్ గా ఉంటారు. అలాంటిది ఆమె తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. రెండవ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది. ఈ సమయంలోనే ఆమెకు దగ్గరగా ఉండే సెలబ్రిటీలు, టాప్ హీరోలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తారని అందరూ అనుకున్నారు.

ఇక్కడ విడ్డూరం ఏమిటంటే కనీసం ఒక్కరు కూడా సమంత పెళ్లి గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హీరోలు శుభాకాంక్షలు చెప్పకపోయినా.. హీరోల భార్యలు శుభాకాంక్షలు తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కాజల్ అగర్వాల్, ఉపాసన, రకుల్ ప్రీత్ సింగ్, రుహానీ శర్మ , ప్రముఖ యూట్యూబర్ , నటి అలేఖ్య హారిక లాంటి సెలబ్రిటీలు సమంతా రెండో పెళ్లి చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే హీరోలు కనీసం ఒక్కరు కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. సమంత రెండో పెళ్లి చేసుకోవడం హీరోలకు కూడా ఇష్టం లేదా అనే కోణంలో అనుమానాలు నెటిజన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి.మరి కొంతమంది నాగచైతన్యను దృష్టిలో పెట్టుకొని సమంతను పట్టించుకోవడం లేదా అనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా అగ్ర కథానాయిక తన జీవితంలో తీసుకున్న ఇంత పెద్ద నిర్ణయానికి ఒక్కరు కూడా స్పందించకపోవడం బాధాకరం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.