ఆ ఇద్దరు హీరోలకు పెద్ద కష్టమే వచ్చినట్లు ఉందే!
అయితే ఇటీవల జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇద్దరు తెలుగు హీరోలకు ఆర్థికంగా ఇబ్బందులు తెచ్చినట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 16 April 2026 6:00 PM ISTసాధారణంగా చాలా మంది హీరోలు కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా, ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఫ్యూచర్ కోసం సేఫ్ ఇన్వెస్ట్మెంట్లుగా మార్చుకోవాలని వారు భావిస్తారు. అయితే ఇటీవల జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇద్దరు తెలుగు హీరోలకు ఆర్థికంగా ఇబ్బందులు తెచ్చినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ కు చెందిన ఆ ఇద్దరు స్టార్ హీరోలు గత కొన్ని సంవత్సరాలుగా సీక్రెట్ గా బిజినెస్ పార్టనర్స్ గా కొనసాగుతున్నారని టాక్ వినిపిస్తోంది. పక్కా ప్లాన్ తో.. బిజినెస్ ఎక్స్పెర్ట్స్ సలహాలతో వారు విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని కొన్నేళ్ల క్రితం నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకుని.. కొంతకాలంగా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.
నిజానికి దుబాయ్ లో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎప్పుడూ దూసుకుపోతుంటోంది. దీంతో ఇద్దరు హీరోలకు తమ పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకేముంది.. మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.. పెట్టారు కూడా. అయితే ఇటీవల మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా వారి లెక్కలు మార్చినట్లు ఇప్పుడు తెలుస్తోంది.
ముఖ్యంగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం.. దాదాపు 39 రోజులపాటు దాడులు చేసుకోవడం.. ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మొత్తానికి అదుపు తప్పాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు దుబాయ్ సమీప ప్రాంతాలను టార్గెట్ చేసుకోవడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో అక్కడి ప్రాపర్టీ ధరలు పడిపోవడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు
అదే సమయంలో ఇప్పుడు ఆ ప్రభావం ఇద్దరు హీరోల పెట్టుబడులపైనా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు సంపాదించిన లాభాలు తగ్గిపోవడం మాత్రమే కాకుండా, కొంత వరకు నష్టాలు కూడా ఎదుర్కొంటున్నారని సమాచారం. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అనిశ్చితి కారణంగా.. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో తెలియక వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
అయితే సినీ ఇండస్ట్రీలో ఎంతటి విజయాలు సాధించినా, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం కాబట్టి.. పెట్టుబడులు పెట్టేటప్పుడు విభిన్న రంగాల్లో పెట్టడం అవసరమని నిపుణులు ఎప్పుడూ సూచిస్తుంటారు. అలా ఒకప్పుడు లాభాలు తెచ్చిన దుబాయ్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులే ఇప్పుడు ఆ ఇద్దరు హీరోలకు తలనొప్పిగా మారినట్లు సమాచారం. పరిస్థితులు కాస్త సెట్ అయ్యే వరకు వారు వేచి చూడాల్సిందేనని తెలుస్తోంది.
