డైరెక్టర్ల కెరీర్‌ని కిల్ చేసిన హీరోలు!
ఈగో కోసం వెళ్లి డైరెక్టర్ల కెరీర్‌లతో ఆడుకుని వారి కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మార్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో కొంత మంది గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
By: Tupaki Desk | 12 July 2025 8:00 AM ISTఇండస్ట్రీలో ప్రాజెక్ట్‌లు చేతులు మారడం, ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకు వెళ్లడం..అది బ్లాక్ బస్టర్ కావడం తెలిసిందే. అయితే ఇదే ఇండస్ట్రీలో డైరెక్టర్ల కెరీర్‌లతో ఆడుకున్న హీరోలు ఉన్నారంటే నమ్ముతారా?.. యస్ ఉన్నారు మీరు విన్నది నిజమే. ఈగో కోసం వెళ్లి డైరెక్టర్ల కెరీర్‌లతో ఆడుకుని వారి కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మార్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో కొంత మంది గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
అలా హీరోలని నమ్మి సినిమాల కోసం ఏళ్లకు ఏళ్లు వృధా చేసుకున్న దర్శకుల్లో కొంత మంది సాగర్ చంద్ర, కృష్ణచైతన్య,క్రిష్ జాగర్లమూడి. సాగర్ చంద్ర వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన సాగర్ చంద్ర నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, శివాజీ ప్రధాన పాత్రలలో నటించిన 'అయ్యారే' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమా మంచి పేరు తెచ్చిపెట్టినా రెండవ సినిమా రావడానికి నాలుగేళ్లు పట్టింది. తను చేసిన రెండవ సినిమా 'అప్పట్లో ఒకడుండేవాడు'. ఇది అనఫీషియల్ బయోపిక్.
దీంతో కూడా మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర వెంటనే బిగ్ హీరోతో సినిమా చేయాలనుకున్నాడు. 14 ప్లస్ రీల్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చింది. అక్కడ కూడా కుదరకపోవడంతో పీవీపీ ఆ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసి సాగర్ చంద్రని హోల్డ్‌లో పెట్టింది. కారణం యంగ్ హీరో. మార్పులు చేర్పులు అంటూ సాగర్ చంద్ర సహనాన్ని పరీక్షించాడు. దీంతో ఏళ్లు గడిచిపోయాయి. 2016లో 'అప్పట్లో ఒకడుండేవాడు' రిలీజ్ అయితే సాగర్ మరో సినిమా పట్టుకోవడానికి ఆరేళ్లు పట్టింది. 2022లో సాగర్ చంద్ర బయటికి వచ్చి చేసిన సినిమా 'భీమ్లానాయక్'. త్రివిక్రమ్ అతని టాలెంట్‌ని గుర్తించి ఈ అవకాశం ఇప్పించాడు. ప్రస్తుతం తను బెల్లంకొండ శ్రీనివాస్‌తో `టైసన్ నాయుడు` చేస్తున్నాడు.
మరో దర్శకుడు కృష్ణచైతన్యదీ ఇదే పరిస్థితి. ఎవరూ టచ్ చేయని కథతో సరికొత్త నేపథ్యంలో ఓ పవర్‌ఫుల్ మూవీ చేయాలని కృష్ణచైతన్య అనుకున్నాడు. ఆ కథ గురించి తెలిసి ఇద్దరు హీరోలు నేను చేస్తానంటే నేను చేస్తానని ముందుకొచ్చారు. ఒకరు చేస్తానన్నారని ఓ హీరో తప్పుకున్నాడు. మరో హీరో చేస్తాడా? అంటే అదీ లేదు. చేయడు. మరొకరిని చేయనివ్వడు.. ఇలా ఇద్దరు హీరోలు కృష్ణచైతన్యతో ఫుట్‌బాల్ ఆట ఆడుకోవడంతో ఆ కథని ఇప్పటికీ చేయలేక దర్శకుడిగా మరో సినిమా చేయలేని పరిస్థితికి వచ్చేశాడు.
ఇలా ఇద్దరు హీరోలు కలిసి దర్శకుడు కృష్ణచైతన్య కెరీర్‌ని స్లో చేశారు. ఇక డైరెక్టర్ క్రిష్ పరిస్థితి కూడా అంతేలా తయారయింది. కంగన ఈగో కారణంగా 'మణికర్ణిక' క్రెడిట్ కోల్పోయిన క్రిష్ ఇప్పుడు పరోక్షంగా పవన్ కారణంగా మరో సారి క్రెడిట్‌ని కోల్పోవడమే కాకుండా ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఫలితం లేకుండా పోయింది. 'హరి హర వీరమల్లు' కోసం కరోనా ముందు నుంచే వర్క్ చేసిన క్రిష్ ప్రస్తుతం దాని నుంచి తప్పుకుని ఆ ఊసే ఎత్తకని పరిస్థితికి వచ్చారు. ఇలా కావాలని కొంతి మంది.. టైమ్ సహకరించక మరికొంత మంది డైరెక్టర్ల కెరీర్‌ని కిల్ చేస్తుండటం సోచనీయం.
