రైటర్స్, డైరెక్టర్స్ ఆ ఛాన్స్ వాడేసుకుంటారా?
ఇందులోని కీలక అతిథి పాత్రలో హీరో శ్రీవిష్ణు నటించాడు. తన క్యారెక్టర్ కథకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై సర్వత్ర చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 24 Jan 2026 11:39 AM ISTటాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఓ స్టార్‌కు హిట్టు కోసం మరో స్టార్ గెస్ట్‌గా కనిపించి తన సపోర్ట్‌ని అందిస్తున్నాడు. ఇలా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లు, బ్లాక్ బస్టర్‌లు అవుతుండటంతో ఇప్పుడు ఈ తరహా కాంబినేషన్‌లపై చర్చ జరుగుతోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన `మన శంకరవరప్రసాద్ గారు` ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వింటేజ్ చిరుని ఈ మూవీలో పరిచయం చేయడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది.
అంతే కాకుండా ఈ సినిమాలోని కీలక అతిథి పాత్రలో వెంకీ మామ కనిపించి మెస్మరైజ్ చేయడం తెలిసిందే. ఇలా ఇద్దరు క్రేజీ స్టార్స్ కలిసి ఒకే స్క్రీన్‌పై సందడి చేయడంతో ప్రేక్షకులు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే తరహాలో మరో సినిమా `నారీ నారీ నడుము మురారి` కూడా సక్సెస్ సాధించింది. టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిన్నటి వరకు వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్న హీరో శర్వానంద్. అయితే తొలిసారి ఫ్యామిలీ కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడం, స్టోరీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సంక్రాంతికి విడుదలైన `నారీ నారీ నడుమ మురారి` శర్వాకు సూపర్ హిట్‌ని అందించింది.
ఇందులోని కీలక అతిథి పాత్రలో హీరో శ్రీవిష్ణు నటించాడు. తన క్యారెక్టర్ కథకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హీరో శర్వానంద్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆసక్తికరంగా మారింది. `నారీ నారీ నడుమ మురారీ` బ్లాక్ బస్టర్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాతలతో పాటు హీరో శర్వానంద్, శ్రీవిష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ హీరో శ్రీవిష్ణుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
`శ్రీవిష్ణు ఎంతో గొప్ప మనసుతో ఇందులో ఓ చిన్న పాత్ర చేశారు. సినిమాని, స్నేహాన్ని నమ్మి ఒక హీరో చిన్న క్యారెక్టర్‌లో నటించడం అనేది మామూలు విషయం కాదు. మా ఇద్దరికీ సరిపడ కథ వస్తే అనిల్ సుంకర నిర్మాణంలో సినిమా చేస్తాం` అని శర్వా తెలిపాడు. ఒక విధంగా చెప్పాలంటే రైటర్స్, డైరెక్టర్స్‌కి ఈ స్టేట్‌మెంట్‌తో ఆఫర్ ఇచ్చాడు. మరి శర్వా ఆఫర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరు హీరోలకు సరిపడే కథని వండి వడ్డిస్తారా?.. అనే చర్చ జరుగుతోంది.
శ్రీవిష్ణు గత కొంత కాలంగా ఎంటర్ టైన్‌మెంట్ ప్రధానంగా సాగే సినిమాలతో సక్సెస్‌లని సొంతం చేసుకుంటూవస్తున్నాడు. `నారీ నారీ నడుమ మురారి`తో ఈ జోనర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శర్వా ప్రస్తుతం బైకర్, భోగీ సినిమాలు చేస్తున్నాడు. ఇక శ్రీవిష్ణు తన రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములాతో విష్ణు విన్యాసం, కామ్రేడ్ కల్యాణ్, మృత్యుంజయ్` వంటి సినిమాలు చేస్తున్నాడు. ఇవి రిలీజ్ అయ్యేలోపు రైటర్స్, డైరెక్టర్స్ శర్వా, శ్రీవిష్ణుల కలయికలో క్రేజీ మల్టీస్టారర్ కోసం స్టోరీని రెడీ చేసి ఈ ఇద్దరిని ఒప్పిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
