Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పాన్ ఇండియా ట్రెండ్ మారుస్తుందా!

ప్ర‌స్తుతం తెలుగు సినిమా అంటే పాన్ ఇండియాని దాటి గ్లోబ‌ల్ స్థాయికి చేరింది.

By:  Tupaki Desk   |   6 May 2025 9:00 PM IST
టాలీవుడ్ పాన్ ఇండియా ట్రెండ్ మారుస్తుందా!
X

ఇండియాకి పాన్ ఇండియా చిత్రాన్ని ప‌రిచ‌యం చేసింది టాలీవుడ్. `బాహుబ‌లి`, `ఆర్ ఆర్ ఆర్` ,` పుష్ప‌`, `కార్తికేయ‌-2`, `క‌ల్కి 2898`, `స‌లార్` లాంటి చిత్రాలు పాన్ ఇండియాలో భారీ విజ‌యం సాధించ‌డంతో ఇది సాధ్య‌మైంది. ఆర్ ఆర్ ఆర్, పుష్ప‌, స‌లార్ చిత్రాల్లో మాస్ యాంగిల్ లో హైలైట్ అయిన చిత్రాలు. ఇది ఇండియా వ‌ర‌కూ సరిపోతుంది. కానీ మ‌ళ్లీ అదే రిపీట్ అయితే మాత్రం పాన్ ఇండియా మార్కెట్ లో వ‌ర్కౌట్ అవ్వ‌దు.

ప్ర‌స్తుతం తెలుగు సినిమా అంటే పాన్ ఇండియాని దాటి గ్లోబ‌ల్ స్థాయికి చేరింది. ఇప్పుడా ఇమేజ్ ను నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త అంతే మేక‌ర్స్ పై ఉంది. `క‌ల్కి 2898` తో నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్ర‌యోగం చేసి గ్లోబ‌ల్ స్థాయిలో వెలిగిపోయాడు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఎక్క‌డా క‌మ‌ర్శియాల్టీకి ఛాన్స్ ఇవ్వ‌కుండా చేసిన చిత్ర‌మిది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్లో రిలీజ్ అయిన చిత్ర‌మిది.` క‌ల్కి` స‌క్సెస్ తో టాలీవుడ్ పాన్ ఇండియా ట్రెండ్ మారింది.

ఇప్పుడు టాలీవుడ్ ముందు గ్లోబ‌ల్ స్థాయిలో చిర స్థానాన్ని సంపాదించ‌డం అన్న‌ది టార్గెట్. అందుకు ద‌ర్శ‌ఖ శిఖ‌రం రాజ‌మౌళి అండ‌దండ‌లు తెలుగు సినిమాకు ఉండ‌నే ఉన్నాయి. `ఆర్ ఆర్ ఆర్` తో గ్లోబ‌ల్ స్థాయిలో రీచ్ అయినా? అది ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమా గా హైలైట్ అయింది. విదేశీయుల‌కు `ఆర్ ఆర్ ఆర్` కొత్త అనుభూతిని అందించింది. కానీ నాగీ క‌ల్కి రీచ్ కి కంటున్యూటీగా రాజ‌మౌళి ఎస్ ఎస్ ఎంబీ 29 ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే.

ఇదొక అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్. మ‌హేష్ తో చేస్తోన్న ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మిది. ఇండియాలో ఈజాన‌ర్ ను ఇంత వ‌ర‌కూ ఏ డైరెక్ట‌ర్ ట‌చ్ చేయ‌లేదు. తొలిసారి రాజ‌మౌళి సాహ‌సించి రంగంలోకి దిగి చేస్తోన్న చి త్ర‌మ‌ది. అలాగే నాగ్ అశ్విన్ `క‌ల్కి` కి కంటున్యూటీగా రెండవ భాగం కూడా చేస్తున్నాడు. భారత ఇతి హాసాల‌ను ఆధారంగా చేసుకుని హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్ తో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. ఈ రెండు సినిమాల స‌క్సెస్ అయితే గ్లోబ‌ల్ స్థాయిలో టాలీవుడ్ రేంజ్ మారిపోతుంది.