ఒక్క హీరోకి బారెడు హీరోయిన్లా?
కథని బట్టి హీరోకి ఇద్దరు హీరోయిన్లా? ఒకరా? అన్నది డిసైడ్ అవుతుంది. అయితే ఇప్పుడు కథతో సంబంధం లేకుండా హీరోయిన్లను తీసుకుంటున్నారు
By: Tupaki Desk | 6 May 2025 12:39 PMకథని బట్టి హీరోకి ఇద్దరు హీరోయిన్లా? ఒకరా? అన్నది డిసైడ్ అవుతుంది. అయితే ఇప్పుడు కథతో సంబంధం లేకుండా హీరోయిన్లను తీసుకుంటున్నారు. మెయిన్ లీడ్ ఒకరైతే తర్వాత వచ్చే హీరోయిన్ సెకెండ్ లీడ్ అవుతుందా? కీలక పాత్రధారి అవుతుందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సినిమా రిలీజ్ వరకూ గానీ రెండవ నాయిక ఎలాంటి పాత్ర పోషిస్తుందన్నది అర్దం కాని పరిస్థితి. రిలీజ్ వరకూ మేకర్స్ ఆ క్యూరియాసిటీ మెయింటెన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలు...పట్టాలెక్కబోయే చిత్రాల్లో స్టార్ హీరోలకు జోడీగా క్రేజీ భామలు రంగంలో కి దిగారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే...
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `విశ్వంభర`లో హీరోయిన్ల జాబితా చాలా పెద్దదే . ఇందులో మెయిన్ లీడ్ త్రీష తీసుకోగా మరో ముగ్గురు భామలు కూడా నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లలో ఎవరైనా ప్లాష్ బ్యాక్ లో చిరంజీవికి జోడీగా నటిం చారా? అన్నది ఓ సస్పెన్స్. సిస్టర్ రోల్స్ కూడా ఉన్నాయని సమాచారం.
అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్` ఇంకా సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇది హారర్ కామెడీ చిత్రం. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లగా నటిస్తున్నారు. రిద్ది కుమార్ కూడా నటిస్తుంది. ఆమె మరో హీరోయిన్ అన్నది ప్రచారంలో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో మొదలవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం పీక్స్ లో జరుగుతోంది.
దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లలో ఎవరు ఎంపికవుతారో చూడాలి. అలాగే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. `బిచ్చగాడు` టైటిల్ తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో హీరోయిన్లగా రాధికా ఆప్టే, నివేదా థామస్ ఎంపికైనట్లు వార్తలొస్తున్నాయి. ఇంకా మరికొంత మంది యంగ్ హీరోల చిత్రాల్లో లేడీ భామల జోరు కనిపిస్తుంది.