Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో ఫ్యామిలీ సినిమాల హవా!

ఈ ర‌క‌మైన‌ సెంటిమెంట్ .. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల ఫార్ములాను నమ్ముకుని ఆగస్టు లో పలు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

By:  Srikanth Kontham   |   4 Aug 2026 3:01 PM IST
టాలీవుడ్‌లో ఫ్యామిలీ సినిమాల హవా!
X

టాలీవుడ్ లో ఎన్ని జాన‌ర్లో సినిమాలొచ్చినా? ఫ్యామిలీ జోన‌ర్ కు మాత్రం ఎప్ప‌టికీ తిరుగుండ‌దు. ప్ర‌యోగాలు..కొత్త కొత్త జోన‌ర్లు ఫెయిలైనా? ఫ్యామిలీ జోన‌ర్లు మాత్రం మినిమం వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూనే ఉంటాయి. ఫ్యామిలీ క‌థ‌నే కాస్త కొత్త‌గా చెప్ప‌గ‌ల్గితే అనీల్ రావిపూడిలా బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుతాలు సృష్టించవ‌చ్చు.కథ ఎంత రొటీన్‌గా ఉన్నా? తెరపై కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన భావోద్వేగాలు ఉంటే చాలు ఆ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తుంటాయి. ఈ సక్సెస్ ఫార్ములాను నమ్ముకునే ప్రస్తుతం టాలీవుడ్‌లో అనేక భారీ ప్రాజెక్ట్‌లు రూపుదిద్దుకుంటున్నాయి.

ఈ ర‌క‌మైన‌ సెంటిమెంట్ .. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల ఫార్ములాను నమ్ముకుని ఆగస్టు లో పలు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. తెలుగు తెరపై ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రాలపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పండుగ వాతావరణాన్ని తలపించేలా రాబోతున్న ఈ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కుటుంబ ప్రేక్షకుల సందడి కనిపించనుంది. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' ముందు వరుసలో ఉంది.

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. విభిన్నమైన కథాంశాలతో పాటు కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. మరోవైపు మాస్ మహారాజా రవితేజ -సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కలయికలో తెర‌కెక్కుతోన్న 'ఇరుముడి' సినిమా కూడా ఆగస్టు రేసులో నిలిచింది. మాస్ సినిమాలతో పాటు చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ ఈ చిత్రంలో రవితేజను పూర్తిగా కొత్త కోణంలో చూపిస్తున్నారు.

ఈ కాంబినేషన్ నుంచి వ‌స్తోన్న తొలి సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇదే కోవలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టిస్తోన్న 'కొరియన్ కనకరాజు' చిత్రం కూడా కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ క‌థ హార‌ర్ జాన‌ర్ అయినా? అది క‌చ్చితంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను అల‌రిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. విభిన్నమైన జోనర్లను ఎంచుకుంటూ ప్రయోగాలు చేసే వరుణ్ తేజ్, ఈసారి పూర్తి వినోదాత్మక కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వైవిధ్యమైన టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా అందరినీ భ‌య‌పెడుతూనే న‌వ్విస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని మేక‌ర్స్ వ్య‌క్తం చేస్తున్నారు.

ఆగస్టు లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్‌లో ఫ్యామిలీ సినిమాల హవాను మరోసారి గట్టిగా చాటుతాయ‌నే న‌మ్మకాన్నిమేక‌ర్స్ వ్య‌క్తం చేస్తున్నారు. యాక్షన్ ..కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఈ చిత్రాలు మంచి విజువల్ .. ఎమోషనల్ ట్రీట్‌ను ఇవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.