Begin typing your search above and press return to search.

రానాకు మళ్లీ ఈడీ నోటీసులు!

అయితే ఇటీవల రానా.. ఈడీ అధికారులకు తిరిగి లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు, సినిమా షూటింగ్స్ ఉన్న కారణంగా జులై 23న అంటే నేడు విచారణకు హాజరు కాలేనని తెలిపారు.

By:  Tupaki Desk   |   23 July 2025 5:18 PM IST
రానాకు మళ్లీ ఈడీ నోటీసులు!
X

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్- ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఆ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ తో పాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఫలానా తేదీ నాడు విచారణకు ఇప్పటికే హాజరు కావాలని ఆదేశించింది. అందులో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కూడా ఉన్న విషయం తెలిసిందే.

రానాతో పాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి జులై 21న నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. జులై 23న రానా దగ్గుబాటి, 30న ప్రకాష్ ‌‌‌రాజ్‌‌‌‌, ఆగస్టు 6న విజయ్‌‌‌‌ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పాన్‌‌‌‌కార్డు సహా బ్యాంక్ లావాదేవీలను తీసుకురావాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే ఇటీవల రానా.. ఈడీ అధికారులకు తిరిగి లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు, సినిమా షూటింగ్స్ ఉన్న కారణంగా జులై 23న అంటే నేడు విచారణకు హాజరు కాలేనని తెలిపారు. అందుకే విచారణకు సంబంధించి మరో తేదీ కావాలని కోరారు. దీంతో తాజాగా ఈడీ అధికారులు మరోసారి రానానుకు నోటీసులను పంపారు.

అందులో ఆగస్టు 11వ తేదీన విచారణకు హాజరు కావాలని తెలిపారు. ప్రస్తుతం ఆ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు.. నటులు ప్రకాష్ రాజ్‌ ఈ నెల 30న, విజయ్‌దేవరకొండ ఆగస్టు 6న, మంచులక్ష్మి ఆగస్టు 13 తేదీల్లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు నోటీసుల్లో మళ్లీ పేర్కొన్నారు.

కాగా.. ఆన్‌ లైన్ బెట్టింగ్ యాప్‌ ల ప్రచారానికి సంబంధించి ఈడీ.. మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపడుతోంది. ఆ యాప్‌ ల ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ ఆరోపణలు చేస్తోంది. అందుకే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఇటీవల కేసులు నమోదు చేసింది.

వారిలో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితోపాటు అనేక మంది ఉన్నారు. అనన్య నాగళ్ల, యాంకర్ శ్యామల, నాయని పావని, నేహా పఠాన్, సిరి హనుమంత్, టేస్టీ తేజ, సుప్రీత, విష్ణు ప్రియ, రీతూ చౌదరి, సావిత్రి, వాసంతి కృష్ణన్, నీతు అగర్వాల్, అమ్రతి చౌదరి, పద్మావతి, సన్నీ యాదవ్ సహా పలువురు ఉన్నారు.