సంచలన డైరెక్టర్ల కొత్త అప్ డేట్ ఎప్పుడు?
డైరెక్టర్లు అంతా రాజమౌళి రూల్ నే పాటిస్తున్నారు. అవసరమైతే రెండు మూడేళ్లు అయినా ఖాళీగా ఉంటాం తప్ప హీరోల విషయంలో తగ్గేదేలే అంటున్నారు.
By: Tupaki Desk | 15 May 2025 11:20 AM ISTపాన్ ఇండియాలో భారీ హిట్లు ఇచ్చినా డైరెక్టర్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది? అంటే స్టార్ హీరోల డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అద్దం పడుతుంది. వాళ్లు ఖాళీ అయ్యేవరకూగానీ స్టార్ డైరెక్టర్లు ఎవ్వరూ మరో హీరోతో సినిమా చేయడానికి సాహసించడం లేదు. డైరెక్టర్లు అంతా రాజమౌళి రూల్ నే పాటిస్తున్నారు. అవసరమైతే రెండు మూడేళ్లు అయినా ఖాళీగా ఉంటాం తప్ప హీరోల విషయంలో తగ్గేదేలే అంటున్నారు.
మరి అలా ఖాళీగా ఉన్న డైరెక్టర్ల విషయానికి వస్తే... ఆర్సీ 17 చిత్రాన్ని సుకుమార్ రామ్ చరణ్ తో ప్రకటిం చిన సంగతి తెలిసిందే. `గేమ్ ఛేంజర్` ఆన్ సెట్స్ లో ఉండగానే ఈప్రకటన వచ్చింది. తన శిష్యుడితో చేయాల్సిన ఆర్సీ 16 పెద్దిపూర్తయితే గానీ చరణ్‌నుంచి క్లియరెన్స్ రాదని తెలిసినా? సుకుమార్ 17 నాదేనంటూ ప్రకటనిచ్చారు. కానీ ఇప్పుడీ సినిమా ఎప్పుడు మొదలవుతుంద కూడా తెలియదు.
`పెద్ది` పూర్తవ్వాలి. రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాతే రామ్ చరణ్ ఆర్సీ 17 గురించి ఆలోచించేది. అప్పటి వరకూ సుకుమార్ 17ని చెక్కుతూనే ఉంటారు. గురూజీ త్రివిక్రమ్ కూడా ఇదే వరుసలో ఉన్నాడు. బన్నీ 22వ చిత్రం ఛాన్స్ అట్లీకి ఇవ్వడంతో గురూజీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మద్యలో వెంకటేష్ తో సినిమా చేస్తాడని వినిపిస్తుంది. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అలా జరగలేదు అంటే ఏడాదిన్నర పాటు త్రివిక్రమ్ బన్నీ కోసం ఎదురు చూడాల్సిందే.
యంగ్ సంచలనం ప్రశాంత్ వర్మ కూడా ఖాళీగా నే ఉంటున్నాడు. `కాంతార` ఫేం రిషబ్ శెట్టితో `హను మాన్` కి సీక్వెల్ గా `జై హనుమాన్` ప్రకటించాడు. కానీ రిషబ్ `కాంతార` ప్రీక్వెల్ పనుల్లో ఉండటంతో? అది పూర్తయ్యే వరకూ అతడి డేట్లు దొరికే పరిస్థితి లేదు. ప్రస్తుతం పీసీయూ పనుల్లో ప్రశాంత్ బిజీగా ఉన్నాడు. ఇంకా వంశీ పైడిపల్లి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా హీరో కోసమే ఎదురు చూస్తున్నారు.
