Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ట్యాలెంట్ బోర్డ‌ర్ అందుకే దాటుతోందా!

మాలీవుడ్, శాండిల్ వుడ్ చిన్న ప‌రిశ్ర‌మ‌లు కాబ‌ట్టి వాళ్లు వ‌చ్చినా? రాక‌పోయినా ? పెద్ద‌గా లెక్క‌లోకి రాదు. కానీ టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్లు మాత్రం అలాంటి కండీష‌న్లు లేకుండా ఏ భాష‌ లోకైనా వెళ్ల‌గ‌ల‌రు.

By:  Tupaki Desk   |   21 April 2025 10:00 PM IST
టాలీవుడ్ ట్యాలెంట్ బోర్డ‌ర్ అందుకే దాటుతోందా!
X

ప‌ర‌భాషా స్టార్ డైరెక్ట‌ర్లు టాలీవుడ్ కి వ‌చ్చి సినిమాలు చేయ‌డం అన్న‌ది వెరీ రేర్. మాతృ భాష‌ల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త ఇత‌ర భాష‌ల‌కు ఇవ్వ‌రు. ఇక హిందీ టాప్ డైరెక్ట‌ర్ల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. వాళ్ల క్రియేటివిటీ అంతా అక్క‌డికే ప‌రిమితం చేస్తారు. ఓ స‌ర్కిల్ ఏర్పాటు చేసుకుని ఎంత చేసినా? అందులోనే చేస్తుంటారు. కోలీవుడ్ లో కూడా ఈ ఒర‌వ‌డి చాలా కాలం కొన‌సాగింది. ఈ మ‌ధ్య కాలంలోనే కాస్త మారింది.

మాలీవుడ్, శాండిల్ వుడ్ చిన్న ప‌రిశ్ర‌మ‌లు కాబ‌ట్టి వాళ్లు వ‌చ్చినా? రాక‌పోయినా ? పెద్ద‌గా లెక్క‌లోకి రాదు. కానీ టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్లు మాత్రం అలాంటి కండీష‌న్లు లేకుండా ఏ భాష‌లోకైనా వెళ్ల‌గ‌ల‌రు. ఎక్క‌డైనా సినిమా తీయ‌గ‌ల‌రు. వెంకీ అట్లూరి, వంశీ పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్ వారు ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే గోపీచంద్ మ‌లినేని, సందీప్ రెడ్డి వంగా లాంటి వారు అటెంప్ట్ చేసి స‌క్స‌స్ అయ్యారు.

అయితే ప్ర‌తిభావంతులు ఇలా బోర్డ‌ర్ దాటడానికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం కూడా తెర‌పైకి వ‌స్తోంది. టాలీవుడ్ యంగ్ హీరోలు కేవ‌లం రీజ‌న‌ల్ మార్కెట్ కే ప‌రిమితం అవ్వ‌డంతో? ఆ డైరెక్ట‌ర్లు అంతా ఇత‌ర భాష‌ల హీరోల వైపు చూస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుంది. టాలీవుడ్ లో సినిమా చేస్తే అది కేవ‌లం అక్క‌డికే ప‌రిమితం అవుతుంది. అదే త‌మిళ‌, హిందీ హీరోతో ప‌నిచేస్తే మాతృ భాష‌తో పాటు ఇత‌ర భాష‌ల మార్కెట్ క‌లిసొస్తుంది? అన్న స్ట్రాట‌జీతో ప‌ర భాష‌ల వైపు చూస్తున్నార‌ని బ‌లంగా వినిపిస్తుంది.

ఇలాంటి వ‌ల‌స క‌ట్ట‌డి చేయాలంటే? టాలీవుడ్ యంగ్ హీరోలు ఇత‌ర భాష‌ల మార్కెట్ పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు. తెలుగు సినిమా ఏదైనా ఇత‌ర భాష‌ల్లోనూ ప్ర‌చారం చేసి అక్క‌డా రిలీజ్ చేస్తే కెరీర్ ప‌రంగా క‌లిసొస్తుందన్న‌ది విశ్లేష‌కుల మాట‌. ప్ర‌తీ సినిమా సాధ్యం కాక‌పోయినా కొన్ని సినిమా లైనా ఆ త‌ర‌హాలో చేయాలంటున్నారు. టాలీవుడ్ పాన్ ఇండియాలో ఎదిగిన నేప‌థ్యంలో యంగ్ హీరోలం తా ద్విభాషా చిత్రాలు చేస్తే పాన్ ఇండియా మార్కెట్ సుల‌భ‌త‌రమ‌వుతుందంటున్నారు. మ‌రి ఈ విష‌యాన్ని ఎంత మంది యంగ్ హీరోలు సీరియ‌స్ గా తీసుకుంటారో చూడాలి.