Begin typing your search above and press return to search.

ప్రభాస్, అనుష్క, చిరంజీవి, రిషబ్ షెట్టీ.. బిగ్ బాక్సాఫీస్ క్లాష్?

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫెస్టివల్ సీజన్ మళ్ళీ దసరా కానుంది. వేసవిలో పెద్ద సినిమాలు రాకపోవడంతో, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు దసరా సీజన్‌పై పూర్తి దృష్టి పెట్టారు.

By:  Tupaki Desk   |   30 April 2025 8:30 AM IST
ప్రభాస్, అనుష్క, చిరంజీవి, రిషబ్ షెట్టీ.. బిగ్ బాక్సాఫీస్ క్లాష్?
X

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫెస్టివల్ సీజన్ మళ్ళీ దసరా కానుంది. వేసవిలో పెద్ద సినిమాలు రాకపోవడంతో, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు దసరా సీజన్‌పై పూర్తి దృష్టి పెట్టారు. షూటింగ్‌లు పూర్తి అయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడిన భారీ సినిమాలు ఇప్పుడు ఒకేసారి దసరాకు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ నెల బాక్సాఫీస్ దగ్గర పెద్ద పోటీ మొదలయ్యేలా కనిపిస్తోంది.

ఈ పోటీలో నెంబర్ వన్ అట్రాక్షన్ ప్రభాస్ నటించిన రాజా సాబ్. ఏప్రిల్ రిలీజ్ కోసం ప్లాన్ చేసినప్పటికీ, సాంకేతిక పనుల్లో జాప్యం కారణంగా రిలీజ్‌ను దసరాకు మళ్లించారు. అయితే రాజా సాబ్ విషయంలో ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్ ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. తుది నిర్ణయం ఇంకా అధికారికంగా రాలేదు. అయినా ఇప్పటివరకు లెక్కలు చూస్తే, దసరా రిలీజ్ టార్గెట్ అన్న మాట వినిపిస్తోంది.

ఇక మరోవైపు అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి సినిమా కూడా దసరా రిలీజ్‌నే లక్ష్యంగా పెట్టుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, విజువల్ వర్క్స్ కారణంగా లేట్ అవుతోంది. మొదట ఏప్రిల్ 18న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ మూవీ ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ తోనే డైరెక్ట్ క్లాష్ చేసే పరిస్థితిలో ఉంది. ఇది నిజమైతే, ఈ 'బాహుబలి' జోడి బాక్సాఫీస్ వద్ద తలపడడం ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంటుంది.

దీనికితోడు చిరంజీవి నటిస్తున్న భారీ విజువల్ ఫాంటసీ డ్రామా విశ్వంభర కూడా పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మొదట ఆగస్టు/సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు. కానీ ప్రస్తుత వేగం చూస్తే, దీని రిలీజ్ కూడా దసరాకే వస్తుందని ఊహిస్తున్నారు. ఒకవేళ ఇది జరిగితే, మరో స్టార్ హీరో కూడ పోటీకి వచ్చేస్తాడు.

టాలీవుడ్ కాకుండా, కన్నడ ఇండస్ట్రీ నుంచి రిషబ్ షెట్టి కాంతార: చాప్టర్ 1 కూడా అధికారికంగా దసరా రిలీజ్ లాక్ చేసేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ బట్టి ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇదే సమయంలో బాలయ్య అఖండ 2 కూడా సెప్టెంబర్ చివర షెడ్యూల్ చేసుకున్నారు. కానీ చిన్నపాటి ఆలస్యం జరిగితే, అది కూడా దసరా బరిలో దిగే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే, దసరా 2025 బాక్సాఫీస్ దగ్గర మామూలు పండగ కాదు. అన్ని అనుకున్నట్లే జరిగితే పెద్దగా గ్యాప్ లేకుండా ప్రభాస్, అనుష్క, చిరంజీవి, రిషబ్ షెట్టి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి పోటీకి రావడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఏ సినిమాకు ప్లస్ అవుతుందో, ఏ సినిమాకు మైనస్ అవుతుందో వేచి చూడాల్సిందే. మరికొద్ది వారాల్లో అధికారిక తేదీలు వెల్లడవుతాయని సమాచారం.