టాలీవుడ్ లో సమస్యలు.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇటీవల నెలకొన్న పరిణామాల గురించి తెలిసిందే. థియేటర్ల బంద్ వివాదం, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహమవ్వడం సహా పలు సంఘటనలు జరిగాయి.
By: Tupaki Desk | 7 Jun 2025 2:59 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇటీవల నెలకొన్న పరిణామాల గురించి తెలిసిందే. థియేటర్ల బంద్ వివాదం, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహమవ్వడం సహా పలు సంఘటనలు జరిగాయి. అలా తెలుగు సినీ పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు వాటి పరిష్కారం ప్రయత్నాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి టాలీవుడ్ లో తాజాగా కమిటీ ఏర్పడింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శనివారం ఉదయం ప్రకటించింది. కమిటీలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల రంగాల నుంచి పలువురు సభ్యులు ఉన్నారు. మొత్తం 30 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు అయింది.
కమిటీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్ ఛైర్మన్ గా వ్యవహరించనునున్నారు. ఛాంబర్ సెక్రటరీ ప్రొడ్యూసర్ దామోదర ప్రసాద్ కన్వీనర్ గా ఉండనున్నారు. వారిద్దరితో కలిపి మొత్తం 30 మంది సభ్యులు ఉన్నారు. మరి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల విభాగాల నుంచి ఎవరెవరు ఉన్నారంటే?
నిర్మాతల విభాగం
దామోదర ప్రసాద్
దిల్ రాజు
టి. ప్రసన్నకుమార్
సి.కల్యాణ్
పి.వి. రవికిషోర్
వై. రవి శంకర్
ఎస్. నాగవంశీ
డీవీవీ దానయ్య
స్వప్నదత్
వై. సుప్రియ
డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి భరత్ భూషణ్, ఎన్. సుధాకర్ రెడ్డి, సుధాకర్, శిరీష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, యూ. వెంకటేశ్వరరావు, ఎం.రాందాస్, ఎన్. నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి ఉండగా.. ఎగ్జిబిటర్ల సెక్టార్ నుంచి టీ.ఎస్. రామ్ ప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, బాల గోవింద రాజు, మహేశ్వర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు ఉన్నారు.
కాగా, విశాఖపట్నంలో మే 30వ తేదీన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత సమస్యలు పరిష్కరించడానికి నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ రంగాల నుంచి 30 మందితో కూడిన అంతర్గత కమిటీ నియమించాలని అప్పుడు నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పుడు ఆ కమిటీ వివరాలు ప్రకటించింది.
