Begin typing your search above and press return to search.

నిర్మాత‌ల్లో మార్పు వ‌చ్చిన‌ట్లేనా?

తెలుగు సినిమా ఎంత‌గా మారింది అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకుంటోన్న స‌క్స‌స్ ల‌తో టాలీవుడ్ క‌థాగ‌మ‌నంలో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది

By:  Tupaki Desk   |   8 May 2025 8:00 AM IST
నిర్మాత‌ల్లో మార్పు వ‌చ్చిన‌ట్లేనా?
X

తెలుగు సినిమా ఎంత‌గా మారింది అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకుంటోన్న స‌క్స‌స్ ల‌తో టాలీవుడ్ క‌థాగ‌మ‌నంలో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. క‌మ‌ర్శియ‌ల్ క‌థ‌ల‌కు ప‌క్క‌న‌బెట్టి కంటెంట్ ఉన్న క‌థ‌ల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు క‌థ‌...అందులో పాత్ర‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి ప‌ని చేస్తున్నారు. ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ఏం చెప్ప‌గ‌లం అన్న దానిపై సీరియ‌స్ గా ప‌నిచేస్తున్నారు.

రోటీన్ పాత్ర లు....స్టోరీ కాకుండా? థియేట‌ర్ కి వె ళ్లిన ప్రేక్ష‌కుడికి కొత్త ఎ క్స్ పీరియ‌న్స్ అందిస్తున్నారు. గ‌త మూడు. .నాలుగేళ్ల‌గా ఈ మార్పు స్ఫ‌ష్టంగా క‌నిపిస్తుంది. అయితే ఈ మార్పుకు నిర్మాత‌లు అంతే స‌హ‌క రించారు కాబ‌ట్టే సాధ్య‌మైంది? అన్న‌ది వాస్త‌వం. ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌ల క‌థ‌ల్ని బ‌లంగా న‌మ్ముతున్నారు కాబ‌ట్టే సాధ్య‌మ‌వుతుంది. స్టోరీల‌ను విశ్లేషించే సామ‌ర్ధ్యం క‌లిగి ఉంటున్నారు.

రోటీన్ క‌థ‌లు వ‌ద్దు అంటూ ముందే చెప్ప‌డంతో ర‌చ‌యిత‌లు నిర్మాత టేస్ట్ కు త‌గ్గ‌ట్టు మౌల్డ్ అవుతు న్నారు. ఒక‌ప్పుడు నిర్మాత అంటే కేవ‌లం డబ్బులు పెట్ట‌డం వ‌ర‌కే ప‌రిమితమ‌య్యేవారు. కానీ నేడు వాళ్లు కూడా దిల్ రాజు, అల్లు అర‌వింద్, సురేష్ బాబు లాంటి వాళ్ల‌ను చూసి క్రియేటివ్ విభాగంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అందువ‌ల్లే మంచి కంటెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. స‌రిగ్గా మూడు నాలుగేళ్ల క్రితమే దిల్ రాజు అండ్ కో న‌వ‌త‌రం నిర్మాత‌లు క‌థ‌ల విష‌యంలో అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని...అలా లేక‌పోతే సినిమాలు తీసినా న‌ష్టాలు త‌ప్ప రూపాయి లాభం ఉండ‌ద‌ని హెచ్చ‌రిం చిన సంగ‌తి తెలిసిందే.

అప్ప‌టి నుంచి ఇండ‌స్ట్రీలో మార్పు క‌నిపిస్తుంది. ఇప్పుడొస్తున్న నిర్మాత‌లు అత్య‌ధికులు బాగా చ‌దు వుకున్న వారు కావ‌డం...వివిధ రంగాల్లో స‌క్సెస్ పుల్ ప‌ర్స‌న్ గా ఉన్న‌వారే. సినిమాలంటే ఎంతో ఫ్యాష‌న్ చూపిస్తున్నారు. స్టోరీల‌పై అవ‌గాహ‌న‌...విశ్లేష‌ణ సామ‌ర్ధ్యం క‌లిగి ఉంటున్నారు. అందుకే కంటెంట్ ఉన్న సినిమాలు వ‌స్తున్నాయన్న‌ది వాస్త‌వం.